HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Toyota Corolla Cross Safety Rating

టొయోటా కారుకు షాకింగ్ సేఫ్టీ రేటింగ్‌.. భ‌ద్ర‌త అంతంత మాత్ర‌మే!

ఆఫ్రికా వంటి మార్కెట్లలో భద్రతా ప్రమాణాలను తగ్గించడంపై గ్లోబల్ NCAP ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో ఇచ్చే స్టాండర్డ్ భద్రతా ఫీచర్లను ఆఫ్రికా మోడళ్లలో కూడా తప్పనిసరి చేయాలని కార్ల తయారీ కంపెనీలను కోరింది.

  • Author : Gopichand Date : 29-01-2026 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Toyota Corolla
Toyota Corolla

Toyota Corolla: ప్రపంచవ్యాప్తంగా టొయోటా కంపెనీ తన కార్ల నమ్మకానికి, భద్రతకు పెట్టింది పేరు. అయితే కొన్నిసార్లు భద్రతా పరీక్షల ఫలితాలు అంచనాలకు భిన్నంగా వస్తుంటాయి. తాజాగా టొయోటా కొరోలా క్రాస్ విషయంలో కూడా ఇదే జరిగింది. గ్లోబల్ NCAP నిర్వహించిన ఇటీవలి క్రాష్ టెస్ట్ నివేదికలో ఈ SUVకి అడల్ట్ సేఫ్టీ (పెద్దల భద్రత)ల కేవలం 2-స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది. ఇది వాహన ప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది.

గ్లోబల్ NCAP ‘Safer Cars for Africa’ ప్రచారంలో భాగంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఆఫ్రికా మార్కెట్ కోసం తయారు చేసిన ఈ మోడల్‌లో ఇతర దేశాలతో పోలిస్తే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు తక్కువగా ఉండటమే ఈ తక్కువ రేటింగ్‌కు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.

భద్రతా ఫీచర్లు

కొరోలా క్రాస్‌లో ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, నీ (మోకాలి) ఎయిర్‌బ్యాగ్, సైడ్ చెస్ట్ ఎయిర్‌బ్యాగ్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, లోడ్ లిమిటర్, ESC వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ (థొరాక్స్) ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ పెల్విస్ ఎయిర్‌బ్యాగ్‌లు ఇందులో లేవు లేదా ఆప్షనల్‌గా ఉంచారు. అలాగే పాదచారుల రక్షణ, స్పీడ్ అసిస్ట్, లేన్ అసిస్ట్ వంటి వ్యవస్థలు కూడా తగినంతగా లేవు.

Also Read: బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

అడల్ట్ సేఫ్టీ (పెద్దల భద్రత) – పనితీరు

పెద్దల భద్రత విభాగంలో ఈ SUV కి 34 పాయింట్లకు గానూ 29.27 పాయింట్లు వచ్చాయి.

ఫ్రంటల్ క్రాష్: డ్రైవర్, ప్యాసింజర్ తల, మెడకు మంచి రక్షణ లభించింది. ఛాతీకి తగినంత రక్షణ ఉంది.

మోకాళ్లు: డ్యాష్‌బోర్డ్ వెనుక ఉన్న నిర్మాణం వల్ల మోకాళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు.

బాడీషెల్: కారు బాడీ స్థిరంగా ఉన్నప్పటికీ ఫుట్‌వెల్ ఏరియా (కాళ్లు పెట్టే చోటు) అస్థిరంగా ఉన్నట్లు తేలింది.

సైడ్ ఇంపాక్ట్: సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించలేదు. ఎందుకంటే ఈ కారులో స్టాండర్డ్ సైడ్ హెడ్ ప్రొటెక్షన్ లేదు. దీనివల్ల ఈ విభాగంలో సున్నా మార్కులు పడ్డాయి.

చైల్డ్ సేఫ్టీ (పిల్లల భద్రత) – 3-స్టార్ రేటింగ్

పిల్లల భద్రత విషయంలో కొరోలా క్రాస్ 3-స్టార్ రేటింగ్‌ను సాధించింది (49 పాయింట్లకు 33 పాయింట్లు).

18 నెలల చిన్నారి డమ్మీకి పూర్తి రక్షణ లభించింది.

అయితే 3 ఏళ్ల చిన్నారి డమ్మీ తల భాగంలో రక్షణ అంతంత మాత్రమే ఉందని పరీక్షలో వెల్లడైంది.

గ్లోబల్ NCAP ఆందోళన

ఆఫ్రికా వంటి మార్కెట్లలో భద్రతా ప్రమాణాలను తగ్గించడంపై గ్లోబల్ NCAP ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో ఇచ్చే స్టాండర్డ్ భద్రతా ఫీచర్లను ఆఫ్రికా మోడళ్లలో కూడా తప్పనిసరి చేయాలని కార్ల తయారీ కంపెనీలను కోరింది. అన్ని దేశాల్లోనూ ఒకే రకమైన సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాలని ఈ సంస్థ విజ్ఞప్తి చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • Corolla Cross Safety Rating
  • safety rating
  • Toyota Corolla

Related News

New Hyundai Venue

హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

కొత్త HX8 వేరియంట్‌లో హ్యుందాయ్ నమ్మకమైన 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది.

  • Tyre Safety Tips

    మీ కారు టైర్లను ఎప్పుడు మార్చాలి?

  • Diesel Or CNG

    ఏ కారు కొంటే మంచిది?!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd