Maruti Car: ఆ మారుతి కార్ పై బంపర్ ఆఫర్.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే అంటూ!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే కారుని అందిస్తోంది.
- By Anshu Published Date - 01:01 PM, Mon - 12 August 24

భారతదేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకి తన పాపులర్ ఎస్‌యూవీ బ్రెజ్జాపై 2024 ఆగస్టులో భారీ డిస్కౌంట్ లును అందిస్తోంది. ఆగస్టులో ఈ మారుతి సుజుకి కార్ కొనుగోలు చేసే వారు రూ. 42,000 డిస్కౌంట్ ని పొందవచ్చు. ఈ ఆఫర్లో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. డిస్కౌంట్లపై మరింత సమాచారం కోసం కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. మారుతీ సుజుకి బ్రెజ్జా ఫీచర్లు, పవర్ట్రెయిన్, ధర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మారుతి సుజుకి బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది.
ఇది గరిష్టంగా 101బిహెచ్‌పీ పవర్, 136ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది కాకుండా మారుతీ బ్రెజ్జాలో సీఎన్జీ పవర్ట్రెయిన్ ఎంపికగా కూడా లభిస్తుంది. సీఎన్జీ పవర్ట్రెయిన్ గరిష్టంగా 88 బిహెచ్పీ శక్తిని, 121.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సీఎన్జీ పవర్ట్రెయిన్ 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుందట. ఇకపోతే ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్ సౌండ్ బాక్స్, సన్ రూఫ్, యాంబియంట్ లైట్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి.
అలాగే కారులో భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులు, వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి. మార్కెట్లో మారుతీ సుజుకి బ్రెజ్జా కియా సోనెట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్0 వంటి ఎస్‌యూవీ లతో పోటీపడుతుంది. టాప్ మోడల్ మారుతీ బ్రెజ్జా ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ .8.34 లక్షల నుండి రూ .14.14 లక్షల వరకు ఉంది.