CNG Bike Named Freedom 125: బజాజ్ సీఎన్‌జీ బైక్ పేరు ఏంటో తెలుసా..? రెండు వేరియంట్లలో బైక్..!
బజాజ్ మొదటి CNG బైక్ పేరు 'ఫ్రీడమ్ 125' (CNG Bike Named Freedom 125). ఇంతకుముందు కూడా ఈ పేరు చాలాసార్లు చర్చకు వచ్చింది.
- Author : Gopichand
Date : 04-07-2024 - 8:46 IST
Published By : Hashtagu Telugu Desk
CNG Bike Named Freedom 125: దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో తన మొదటి CNG బైక్‌ను రేపు అంటే జూలై 5న భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొంటారు. అయితే అంతకంటే ముందే ఈ బైక్ పేరు వెల్లడి చేశారు కంపెనీ ప్రతినిధులు. దాని సాధ్యమైన ధర, మైలేజీ గురించి కొన్ని వివరాలు వెల్లడించారు. బజాజ్ బైక్ కోసం బుకింగ్స్ కూడా రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి.
ఫ్రీడమ్ 125 అనేది బజాజ్ బైక్ పేరు
మీడియా నివేదికల ప్రకారం.. బజాజ్ మొదటి CNG బైక్ పేరు ‘ఫ్రీడమ్ 125’ (CNG Bike Named Freedom 125). ఇంతకుముందు కూడా ఈ పేరు చాలాసార్లు చర్చకు వచ్చింది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో CNG బైక్ కోసం ఈ పేరును జాబితా చేసింది. కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్‌ని కొనుగోలు చేయడానికి మీరు రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది. దీని కోసం మీరు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
బుధవారం (జూలై 3) బజాజ్ ఈ CNG బైక్ వీడియో టీజర్‌ను కూడా విడుదల చేసింది. దీనిలో బైక్ స్వల్ప మార్పులతో కనిపించింది. CNG బైక్ స్విచ్ బటన్‌తో పాటు కుడి వైపున హ్యాండిల్ బార్‌లో ఇన్‌స్టాల్ చేసినట్ల కనిపిస్తోది. ఈ స్విచ్ సహాయంతో బైక్‌ను ఇంధనం, CNG మోడ్‌కు సులభంగా మార్చవచ్చు.
ధర ఎంత ఉంటుంది?
కొత్త ‘ఫ్రీడమ్ 125’ సిఎన్‌జి బైక్ ధరకు సంబంధించి బజాజ్ ఆటో నుండి ఎటువంటి సమాచారం అందలేదు, అయితే ఇది పెట్రోల్‌తో నడిచే బైక్‌ల కంటే కొంచెం ఖరీదైనది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.85,000 నుండి ప్రారంభం కావచ్చని అంచనా. ఈ బైక్‌ను రెండు వేరియంట్లలో అందించే అవకాశం ఉంది.
We’re now on WhatsApp : Click to Join
మైలేజీ ఎంత ఇవ్వొచ్చు..?
మైలేజీ గురించి చెప్పాలంటే ఈ బైక్ ఒక కిలో సిఎన్‌జిలో దాదాపు 100 నుండి 120 కి.మీల దూరం ప్రయాణిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ బైక్‌కి సంబంధించిన అన్ని వివరాలు జూలై 5న అందుబాటులోకి రానున్నాయి.