ట్రైన్‌నే లాగిన కారు.. ధర ఎంతో తెలుసా?
ఈ SUV సుమారు 406.4 టన్నుల బరువున్న రైలును దాదాపు 300 అడుగుల వరకు లాగింది. జమ్మూ కాశ్మీర్‌లోని కాకాపోరా- అవంతీపోరా మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ రికార్డును నెలకొల్పారు.
- Author : Gopi
Date : 11-04-2026 - 4:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఒక SUV రైలును లాగడం వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ JSW MG Motor India దీనిని నిజం చేసి చూపించింది. MG Majestor అనే SUV ఈ అద్భుతమైన ఘనకార్యాన్ని చేసి నేరుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకుంది. అత్యంత విశేషమేమిటంటే.. ఇందుకోసం వారు ఎటువంటి మార్పులు చేసిన కారును వాడలేదు. ఇది పూర్తిగా ఒక స్టాక్ SUV. MG Majestor SUV లాగిన అత్యంత బరువైన రైలు విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను తన సొంతం చేసుకుంది. ఒక SUV ఇంత బరువైన రైలును లాగడం ఇదే మొదటిసారి అని కంపెనీ తెలిపింది.
406 టన్నుల రైలును 300 అడుగుల వరకు
ఈ SUV సుమారు 406.4 టన్నుల బరువున్న రైలును దాదాపు 300 అడుగుల వరకు లాగింది. జమ్మూ కాశ్మీర్‌లోని కాకాపోరా- అవంతీపోరా మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ రికార్డును నెలకొల్పారు. గిన్నిస్ ప్రమాణాల ప్రకారం నిర్ణయించిన 400 టన్నుల బరువు, 100 అడుగుల దూరాన్ని ఈ కారు చాలా సులభంగా అధిగమించింది. ఈ ప్రయోగాన్ని ఆటోమోటివ్, మోటార్‌స్పోర్ట్ నిపుణుల సమక్షంలో నిర్వహించారు. అయితే దీని ధర రూ. 35 లక్షల నుండి రూ. 45 లక్షల వరకు ఉండొచ్చు అని అంచనా.
రైలు కాంబినేషన్ ఎలా ఉంది?
ఈ రైలులో ఒక WAG-9HC లోకోమోటివ్, ప్యాసింజర్ కోచ్‌లు, ఒక గార్డ్ కోచ్ ఉన్నాయి. ఈ మొత్తం రైలు బరువును వెరిఫై చేయగా 406 టన్నులుగా నిర్ధారణ అయింది.
Also Read: ముంబై ఇండియన్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ!
ఎటువంటి మార్పులు లేని స్టాక్ SUV
ఈ పరీక్షలో వాడిన MG Majestor పూర్తిగా షోరూమ్ మోడల్. దీని ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్ లేదా ట్రాక్షన్ సిస్టమ్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. కారు అసలైన శక్తిని నిరూపించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
శక్తివంతమైన ఇంజిన్- ఫీచర్లు
MG Majestorలో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 215.5 PS పవర్, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంత బరువును లాగుతున్నా SUV కదలిక చాలా స్థిరంగా, నియంత్రణలో ఉంది.
ఫీచర్లు: 4WD సిస్టమ్, 10 డ్రైవ్ మోడ్స్, ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్, క్రాల్ కంట్రోల్, 219mm గ్రౌండ్ క్లియరెన్స్, లెవల్ 2 ADAS టెక్నాలజీ.
బుకింగ్స్: ఈ SUV త్వరలో లాంచ్ కానుంది. రూ. 41,000 తో దీని ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మొదటి 3000 మంది కస్టమర్లకు 5 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.