Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రోక్స్ విడుదల.. ధర ఎంతంటే..?
మహీంద్రా థార్ రోక్స్ MX1 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది మాన్యువల్, గేర్‌బాక్స్‌తో వస్తుంది. 152hp శక్తిని, 330 Nm టార్క్‌ను ఇస్తుంది.
- By Gopichand Published Date - 08:40 AM, Thu - 15 August 24

Mahindra Thar Roxx: అనేక టీజర్ల తర్వాత మహీంద్రా ఎట్టకేలకు తన థార్ రోక్స్ (Mahindra Thar Roxx)ని విడుదల చేసింది. దీని ధరలను కంపెనీ ప్రకటించింది. ఇది 5 డోర్ వెర్షన్‌లో వస్తుంది. కొత్త థార్ రోక్స్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో విడుదల చేసింది. దీని ఎంట్రీ-లెవల్ (MX1) పెట్రోల్ వేరియంట్ ధర రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే దీని ఎంట్రీ-లెవల్ డీజిల్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. రాక్స్ ధరలు 3-డోర్ వేరియంట్ కంటే దాదాపు రూ. 1.64 లక్షలు ఎక్కువ.
ఇంజిన్- పవర్
మహీంద్రా థార్ రోక్స్ MX1 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది మాన్యువల్, గేర్‌బాక్స్‌తో వస్తుంది. 152hp శక్తిని, 330 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది కాకుండా ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కూడా పొందుతుంది. మహీంద్రా థార్ రోక్స్ బేస్ మోడల్ MX1లో 18-అంగుళాల స్టీల్ వీల్స్‌తో సహా అనేక మంచి ఫీచర్లు చేర్చబడ్డాయి.
Also Read: Midnight Protest : అట్టుడికిన కోల్‌కతా.. ఆస్పత్రిని ధ్వంసం చేసిన నిరసనకారులు
ఇది LED లైట్లు, డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ కలిగి ఉంది
ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇచ్చారు. ఇది కాకుండా పుష్ బటన్ స్టార్ట్, డ్రైవర్ సీటు సర్దుబాటు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు ఇది 60:40 స్ప్లిట్ రియర్ ఫోల్డింగ్ బెంచ్ సీటును కలిగి ఉంది. ఇది వెనుక ప్రయాణీకుల కోసం AC వెంట్ ఫీచర్‌ను కలిగి ఉంది. USB పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. దీనిలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేయవచ్చు.
ఈ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో ప్రవేశపెట్టబడింది. మహీంద్రా థార్ రాక్స్‌లో భద్రతకు సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రత కోసం, MX1 వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
డిజైన్, అనుభూతి
కొత్త థార్ రోక్స్ డిజైన్ ప్రీమియం మాత్రమే కాదు. ఇది చాలా బోల్డ్, స్పోర్టీగా కూడా ఉంది. ఇప్పటికే ఉన్న 3 డోర్‌లతో పోలిస్తే ఇది ముందు భాగంలో కొత్త గ్రిల్‌ని పొందుతుంది. థార్ రాక్స్ మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైదర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, ఎమ్‌జి ఆస్టర్ వంటి SUVలతో పోటీపడుతుంది.