HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Kinetic Green E Luna Electric Moped Launched In India Priced From 69 990 Rupees

Kinetic Green E-Luna: మార్కెట్లోకి లంచ్ అయిన కైనెటిక్ గ్రీన్ ఈ-లూన్నా.. ధర, ఫీచర్స్ ఇవే?

వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కైనెటిక్ ఈ లూనా ను ఎట్టకేలకు భారత్ లోకి లాంచ్ చేశారు. కైనెటిక్ గ్రీన్ సంస్థ ఈ ఎలక్ట్రిక్ లూనా

  • By Anshu Published Date - 03:25 PM, Thu - 8 February 24
  • daily-hunt
Mixcollage 08 Feb 2024 03 24 Pm 6197
Mixcollage 08 Feb 2024 03 24 Pm 6197

వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కైనెటిక్ ఈ లూనా ను ఎట్టకేలకు భారత్ లోకి లాంచ్ చేశారు. కైనెటిక్ గ్రీన్ సంస్థ ఈ ఎలక్ట్రిక్ లూనాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ కొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా రూ. 69,990 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఈ లూనాను రూపకల్పన చేశారు. ఈ ఎలక్ట్రిక్ లూనాను పూర్తిగా భారతదేశంలో రూపొందించారు. కాగా ఈ కొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనాలో డ్యూయల్ ట్యూబ్యులర్ హై-స్ట్రెంగ్త్ స్టీల్ చట్రం ఉపయోగించారు. ఇది ఎలక్ట్రిక్ మోపెడ్ హెవీ డ్యూటీ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ లూనా మోడల్ 150 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా లో వెనుక సీటును తొలగించి, ఆ ప్రదేశంలో లగేజ్ ను పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. కొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా ను లాంచ్ చేస్తున్న సందర్భంగా కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు, సీఈఓ సులాజ ఫిరోడియా మోత్వాని మాట్లాడుతూ.. ఈ ఇ-లూనా ఆవిష్కరణ కైనెటిక్ గ్రీన్‌ కి గర్వకారణం. ఎలక్ట్రిక్ రూపంలో ఇది పునరాగమనం చెందడం లూనా ప్రేమికులకు శుభవార్త. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ఇ-లూనా ప్రవేశం విప్లవానికి తక్కువేమీ కాదు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు ఆటోమొబైల్ మార్కెట్‌లో కేవలం 5 నుండి 6 శాతం మాత్రమే ఉన్నాయి. అందుకు రెండు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఎలక్ట్రిక్ వాహనాల అధిక ధర. ఇక రెండవది వాటితో చాలా వరకు మెట్రో లేదా పెద్ద నగరాలను దాటి ప్రయాణించడం సాధ్యం కాకపోవడం.

ఈ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో కైనెటిక్ గ్రీన్ ఈ-లూనా ను రూపొందించింది. కాగా ఈ కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా మూడు బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది. అవి 1.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్. ఇందులో 2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జ్ తో 110 కిమీల వరకు ప్రయాణించవచ్చు. 3 kWh బ్యాటరీ ప్యాక్‌ తో ఒకే ఛార్జ్‌పై 150 కిమీల వరకు ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలు సమర్థవంతమైన థర్మల్ మేనేజ్‌మెంట్‌తో అత్యధిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, E-Luna ఫాస్ట్ ఛార్జింగ్ స్వాప్ చేయగల బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కాగా ఈ కొత్త ఈ లూనా గరిష్ట వేగం గంటకు 50 కిలో మీటర్ లు. బ్యాటరీ, మోటారు,కంట్రోలర్ అన్నీ IP 67 రేటింగ్‌తో వాటర్, డస్ట్ ప్రూఫ్ అని కైనెటిక్ గ్రీన్ చెబుతోంది.

మోడల్ రియల్ టైమ్ DTE ఇండికేటర్‌తో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా ఇందులో పొందుపర్చారు. కాంబి-బ్రేకింగ్, USB ఛార్జింగ్ పోర్ట్, మూడు రైడింగ్ మోడ్‌లు, సైడ్-స్టాండ్ సెన్సార్ మొదలైన ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. E-లూనాలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, 16-అంగుళాల వైర్-స్పోక్డ్ వీల్స్‌ ను అమర్చారు. కొత్త ఇ-లూనా భారత్ లోని చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదారులకు అవసరమైన సేవలను అందించగలదు. సరసమైన ధరలో లభించడం ఈ కైనెటిక్ గ్రీన్ ఈ లూనా ప్రత్యేకత. ఈ లూనా నిర్వహణ ఖర్చు ప్రతి కిమీకి 10 పైసలు మాత్రమేనని కంపెనీ చెబుతోంది. రుణంతో తీసుకుంటే, దాదాపు రూ. 2,000 నెలవారీ వాయిదా, నెలకు రూ. 300 ఛార్జింగ్ ఖర్చుతో నెలకు రూ. 2,500 లోపు వ్యయంతో ఈ వాహనాన్ని వాడుకోవచ్చు. ఈ లూనా మల్బరీ రెడ్, పెర్ల్ ఎల్లో, నైట్ స్టార్ బ్లాక్, ఓషన్ బ్లూ, స్పార్క్లింగ్ గ్రీన్. కైనెటిక్ గ్రీన్ డీలర్‌షిప్‌ల ద్వారా మరి కొన్ని రోజుల్లో డెలివరీలు ప్రారంభం అవుతున్నాయి. మొదట బుక్ చేసుకోవాలి అనుకున్న వారు 500 రూపాయల అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Kinetic Green E-Luna
  • Kinetic Green E-Luna bike
  • price

Related News

Powerful Officers

Powerful Officers: ప్రధానికి అత్యంత సన్నిహితులు ఈ అధికారులే.. మొత్తం వ్యవస్థపై పట్టు వీరిదే!!

ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు పదవిలో అజిత్ డోభాల్ ఉన్నారు. 1968 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అజిత్ డోభాల్ ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎం.ఏ. పూర్తి చేశారు.

  • Imran Khan

    Imran Khan: ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు?

  • Modi Speech

    Viksit Bharat : యూత్ సంకల్పమే ‘వికసిత్ భారత్’ – మోదీ

  • India

    India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

Latest News

  • Viral: పెళ్లి తంతు జరగకుండా చేసిన రసగుల్లా ..అసలు ఏంజరిగిందంటే !!

  • Jagan : చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి – జగన్ డిమాండ్

  • Terrorist : జైషే మహ్మద్ మహిళా వింగ్లో 5 వేల మంది మహిళలు

  • Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!

  • Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం

Trending News

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd