Recalls 300-350 CC Bikes: హోండా బైక్స్ వాడేవారికి అలర్ట్.. ఈ మోడల్స్ బైక్‌లను రీకాల్ చేసిన కంపెనీ!
కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో ఈ సమస్యను సరిదిద్దుతామని HMSI తెలిపింది. దీని కోసం వారంటీ గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సమస్యకు సంబంధించిన లోపం ఉచితంగా సరిచేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
- By Gopichand Published Date - 06:37 PM, Tue - 17 September 24

Recalls 300-350 CC Bikes: వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్‌లో సమస్యల కారణంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా CB350, H’ness CB350 మోటార్‌సైకిళ్ల కొన్ని యూనిట్లను రీకాల్ (Recalls 300-350 CC Bikes) చేసింది. అక్టోబర్ 2020- ఏప్రిల్ 2024 మధ్య తయారు చేయబడిన CB300F, CB300R, CB350, H’ness CB350, CB350RS, వీల్ స్పీడ్ సెన్సార్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంలో ఈ బైక్‌లన్నింటినీ రీకాల్ చేస్తున్నారు.
సరికాని మౌల్డింగ్ ప్రక్రియ కారణంగా వీల్ స్పీడ్ సెన్సార్‌లోకి నీరు ప్రవేశించవచ్చని గమనించినట్లు కంపెనీ తెలిపింది. ఇది స్పీడ్ సెన్సార్ పనిచేయకపోవటానికి కారణం కావచ్చు. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్ లేదా ABS లోపానికి కారణం కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఇది బ్రేకింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. అక్టోబర్ 2020 నుండి ఏప్రిల్ 2024 వరకు ఉత్పత్తి చేయబడిన యూనిట్లలో మాత్రమే ఈ సమస్య కనిపించిందని కంపెనీ తెలిపింది.
క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో సమస్య కారణంగా HMSI CB350, H’ness CB350, CB350RS యూనిట్‌లను రీకాల్ చేస్తోంది. క్యామ్‌షాఫ్ట్ కోసం సరికాని తయారీ ప్రక్రియ వాహనం సరైన పనితీరును ప్రభావితం చేస్తుందని గమనించినట్లు కంపెనీ తెలిపింది. జూన్ 2024- జూలై 2024 మధ్య తయారు చేయబడిన యూనిట్లు ఈ సమస్యతో ప్రభావితమైనట్లు పేర్కొంది.
కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో ఈ సమస్యను సరిదిద్దుతామని HMSI తెలిపింది. దీని కోసం వారంటీ గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సమస్యకు సంబంధించిన లోపం ఉచితంగా సరిచేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంటే వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఈ సమస్యకు సంబంధించిన ఏవైనా సందేహాల కోసం కస్టమర్‌లు డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చని తెలిపింది. ద్విచక్ర వాహన తయారీదారు హోండా అధికారిక ప్రకటనలో బైక్ ప్రభావిత భాగాలను దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ అధీకృత డీలర్‌షిప్ బిగ్‌వింగ్‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దీని కోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే బైక్ వారంటీ స్థితిని చెక్ చేస్తారు.