Honda Hornet 2.0: భారీ మార్పుతో హోండా బైక్.. ధర ఎంతంటే?
కొత్త హార్నెట్ 2.0 4.2 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఫోన్‌ను హోండా రోడ్‌సింక్ యాప్ సహాయంతో కనెక్ట్ చేయవచ్చు.
- By Gopichand Published Date - 01:37 PM, Wed - 19 February 25

Honda Hornet 2.0: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తన బైక్‌లు.. స్కూటర్‌లను కొత్త ఇంజన్‌లతో అప్‌డేట్ చేస్తోంది. కంపెనీ ఇప్పుడు తన స్పోర్ట్స్ బైక్ హార్నెట్ 2.0ని (Honda Hornet 2.0) OBD2B-కంప్లైంట్ ఇంజన్‌తో అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ.1,56,953గా పేర్కొన్నారు. స్టైలిష్ డిజైన్, ఫీచర్లు, ఇంజన్, భద్రత ఈ బైక్‌లో కనిపిస్తాయి. మీరు కూడా కొత్త 2025 హోండా హార్నెట్ 2.0ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ బైక్‌కి సంబంధించిన సరైన సమాచారాన్ని అందిస్తున్నాం.
Also Read: H-1B Visa Cost: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్! H-IB వీసా ఖరీదైనదిగా మారే అవకాశం?
కొత్త 2025 హోండా హార్నెట్ 2.0 ప్రత్యేకత ఏమిటి?
ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. కొత్త హార్నెట్ 2.0 4.2 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఫోన్‌ను హోండా రోడ్‌సింక్ యాప్ సహాయంతో కనెక్ట్ చేయవచ్చు. ఈ బైక్‌లో USB C టైప్ ఛార్జింగ్ పోస్ట్ కూడా ఉంది. దాని సహాయంతో మీరు మీ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయవచ్చు. ఇందులో నావిగేషన్ సౌకర్యం లభిస్తుంది. భద్రత కోసం ఈ బైక్ డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది. ఈ బైక్‌లో LED లైట్ సెటప్ అందుబాటులో ఉంది. ఈ బైక్‌లో మీరు ఇప్పుడు పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్‌లను పొందుతారు. ఈ రంగుల కారణంగా బైక్ మెరుగ్గా కనిపిస్తుంది.
కొత్త 2025 హోండా హార్నెట్ 2.0 12.50 kW పవర్, 15.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే OBD2B-కంప్లైంట్ కలిగిన సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. మొత్తంమీద ఈ ఇంజన్ చాలా పటిష్టంగా ఉంటుందని, బైక్ పనితీరు కూడా బాగుంటుందని కంపెనీ పేర్కొంది. సరదా రైడ్ కోసం ఇది ఒక మంచి బైక్ అని నిరూపించవచ్చు. కొత్త 2025 హోండా హార్నెట్ 2.0 అధిక పనితీరు గల బైక్. ఇది యువతను మాత్రమే లక్ష్యంగా చేసినట్లు సమాచారం. కొత్త అప్‌డేటెడ్ ఇంజన్, ఫీచర్లతో కూడిన ఈ బైక్‌ను కస్టమర్లు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.