Premium Bikes Launched In 2023: 2023లో విడుదల అయిన 5 ప్రీమియం బైకులు ఇవే.. అదిరిపోయే ఫీచర్స్ తో?
ప్రతి ఏడాది లాగే గత ఏడాది అనగా 2023లో కూడా ఎన్నో రకాల బైక్స్ విడుదలైన విషయం తెలిసిందే. అందులో కొన్ని బైక్స్ వినియోగదారులను ఆకర్షించడంతోపాటు ఎ
- By Anshu Published Date - 05:34 PM, Mon - 1 January 24

ప్రతి ఏడాది లాగే గత ఏడాది అనగా 2023లో కూడా ఎన్నో రకాల బైక్స్ విడుదలైన విషయం తెలిసిందే. అందులో కొన్ని బైక్స్ వినియోగదారులను ఆకర్షించడంతోపాటు ఎక్కువగా అమ్ముడయ్యాయి. వాటిలో ముఖ్యంగా ఐదు రకాల బైక్ లు హై క్వాలిటీ అదిరిపోయే ఫీచర్స్ తో బాగా ఆకట్టుకున్నాయి. మరి 2023లో విడుదలైన ఐదు ప్రత్యేక బైకులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్రిటీష్ బైక్ తయారీదారు ట్రయంఫ్, బజాజ్ ఆటో భాగస్వామ్యంతో, ఈ రెండు బైక్‌లను 2023 సంవత్సరంలో చాలా తక్కువ ధరకు భారతీయ వినియోగదారులకు పరిచయం చేసింది. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400Xని రెండు బైక్‌లు భారతదేశంలో కంపెనీ చౌకైన బైక్‌లుగా విడుదల అయ్యాయి. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400Xని వాటి పనితీరు, నాణ్యత కారణంగా ప్రజలు ఇష్టపడుతున్నారు. రెండు బైక్‌ల లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ట్రయంఫ్ యొక్క ఈ రెండు బైక్‌లు 398cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి, ఇది 8,000rpm, 6,500rpm దగ్గర 40 bhp శక్తినీ, 37.5 Nm టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అద్భుతమైన ఫిట్, ఫినిషింగ్‌తో, ఇవి మనీ ప్యాకేజీకి తగినట్లు ఉన్నాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.33 లక్షలతో ప్రారంభమవుతుంది.
హీరో మోటో కార్ప్ కంపెనీ కరీజ్మా XMAR పేరుతో పూర్తిగా కొత్త అవతార్‌ను పరిచయం చేసింది. కొత్త కరిజ్మాకు పూర్తి బాడీ ఫెయిరింగ్‌తో పదునైన డిజైన్ ఇచ్చింది. బైక్‌లో చేసిన ప్రీమియం డిటైలింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో పూర్తిగా కొత్త ఇంజన్ ఇన్‌స్టాల్ చేసింది. కొత్త హీరో కరిజ్మాలో 210cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది, ఇది 25.5 bhp శక్తినీ, 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కరిజ్మా XMAR ఎక్స్-షోరూమ్ ధర రూ.1.80 లక్షలుగా ఉంది.
కేటీఎమ్ 390 డ్యూక్.. ఈ కొత్త KTM డ్యూక్ 390 దాని మునుపటి మోడల్ వలె అదే లక్షణాలను కలిగి ఉంది. అయితే దీని డిజైన్ ఇప్పుడు మరింత పదునుగా, దూకుడుగా ఉంది. ఈ బైక్‌లో 45 bhp పవర్, 39 Nm టార్క్ ఉత్పత్తి చేసే కొత్త 399సీసీ ఇంజన్ కూడా ఉంది. కేటీమ్ 390 డ్యూక్ దాని ధరల విభాగంలో అత్యంత శక్తివంతమైన బైక్. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.11 లక్షలు.
టీవీఎస్ అపాచ్చి RTR 310.. టీవీఎస్ యొక్క నేక్డ్ ఫ్లాగ్‌షిప్ బైక్ Apache RTR 310 దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచింది. దీని దూకుడు స్టైలింగ్, ప్రత్యేక ఫీచర్లు దీని అతిపెద్ద ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ బైక్‌లో 312.12సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది, ఇది 35 bhp శక్తినీ, 28.7Nm టార్క్‌నూ ఉత్పత్తి చేస్తుంది. Apache RTR ఎక్స్-షోరూమ్ ధర రూ.2.43 లక్షల నుంచి, రూ. 2.64 లక్షల మధ్య ఉంటుంది.
Harley-Davidson X440… ఈ బైక్ ట్రయంఫ్ స్పీడ్ 400కి పోటీగా విడుదల అయ్యింది. ఇండియన్ మార్కెట్లో దాదాపుగా మరిచిపోయిన హార్లే, ఈ బైక్‌తో కొత్త గుర్తింపు తెచ్చుకుంది. X440 భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క అత్యంత సరసమైన బైక్. ఇది హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో వచ్చింది. Harley-Davidson X440 440సీసీ లిక్విడ్ కూల్డ్, 2 వాల్వ్ ఇంజన్ కలిగి ఉంది, ఇది 27.37 bhp శక్తినీ, 38 Nm టార్క్‌నూ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.40 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.