Innova: మార్కెట్లోకి ఇథనాల్‌తో నడిచే ఇన్నోవా కారు
భారతీయ వాహన మార్కెట్‌లో ఇన్నోవా కార్లకు డిమాండ్ ఎక్కువే. చూడటానికి లగ్జరీగా కనిపించడమే కాకుండా ఎక్కువమంది కూర్చునే వెసులుబాటు ఈ కార్లకు సొంతం
- By Praveen Aluthuru Published Date - 05:28 PM, Tue - 29 August 23
Innova: భారతీయ వాహన మార్కెట్‌లో ఇన్నోవా కార్లకు డిమాండ్ ఎక్కువే. చూడటానికి లగ్జరీగా కనిపించడమే కాకుండా ఎక్కువమంది కూర్చునే వెసులుబాటు ఈ కార్లకు సొంతం. అయితే ఇన్నాళ్లు ఈ కార్ కేవలం డీజిల్ తో మాత్రమే నడిచేది. కానీ తాజాగా సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇన్నోవాలో ఇథనాల్‌తో నడిచే వెర్షన్ వస్తోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం E100 వాహనాలను (పూర్తిగా ఇథనాల్‌తో మాత్రమే నడుస్తుంది) ఉత్పత్తి చేసి ఉపయోగించడానికి ఆసక్తి చూపుతోంది. మొదట ఇన్నోవా ఈ-100 లాంచ్ అయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ కారును లాంచ్ చేయనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి BSVI (స్టేజ్ 2) పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు మోడల్. ముడి చమురు దిగుమతులపై భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధన సెల్ వాహనాలు మరియు సహజ వాయువుతో నడిచే వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ దశలో ప్రభుత్వం కూడా 100 శాతం ఇథనాల్ వాహనాలను ప్రోత్సహించే పనిలో పడింది.
Also Read: Human Fish : మనిషి లాంటి దంతాలు, పెదవులతో చేప.. అసలు విషయమిదీ ?