Big Discounts: ఈ కియా కార్లపై భారీ ఆఫర్లు.. సెల్టోస్‌పై ఏకంగా రూ. 2 లక్షలు!
ఈ నవంబర్ నెలలో మీరు కంపెనీ మధ్యతరహా SUV సెల్టోస్‌ను కొనుగోలు చేయబోతున్నట్లయితే మీరు ఈ వాహనంపై రూ. 2 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఎంపిక చేసిన వేరియంట్లపై మాత్రమే ఈ తగ్గింపులు అందించబడుతున్నాయి.
- Author : Gopichand
Date : 14-11-2024 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
Big Discounts: కార్ల కంపెనీలకు కాలం కలిసి రావాలి. తమ అమ్మకాలను పెంచుకోవడానికి మొదటి పండుగ సీజన్‌లో డిస్కౌంట్లు ఇచ్చారు. అయితే పాత స్టాక్ ఇప్పటికీ క్లియర్ కాలేదు. దీని కారణంగా కంపెనీలు ఈ నెలలో మరోసారి మంచి తగ్గింపులను (Big Discounts) అందిస్తున్నాయి. కియా ఇండియా తన 3 అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలపై రూ. 2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపులు, ఆఫర్‌లు కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లపై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం?
కియా సెల్టోస్‌పై రూ. 2 లక్షల తగ్గింపు
ఈ నవంబర్ నెలలో మీరు కంపెనీ మధ్యతరహా SUV సెల్టోస్‌ను కొనుగోలు చేయబోతున్నట్లయితే మీరు ఈ వాహనంపై రూ. 2 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఎంపిక చేసిన వేరియంట్లపై మాత్రమే ఈ తగ్గింపులు అందించబడుతున్నాయి. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ.10.90 లక్షల నుండి రూ.20.45 లక్షల వరకు ఉంది. సెల్టోస్‌లోని ఫీచర్లు చాలా బాగున్నా కానీ దీని డిజైన్ బాగా లేదు. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకోలేదు. ఎక్కువ దూరం వెళ్లినప్పుడు ట్రబుల్ ఇస్తుంది. కొనుగోలు చేసే ముందు ఖచ్చితంగా సెల్టోస్ టెస్ట్ డ్రైవ్ తీసుకోండి.
Also Read: Viacom18 నుండి ప్రారంభమవుతున్న నాలుగు కొత్త FAST ఛానెల్‌లు శామ్సంగ్
కియా సోనెట్‌పై రూ. 55,000 వరకు తగ్గింపు
ఈ నెలలో మీరు Kia చౌకైన SUV అయిన Sonet కొనుగోలుపై రూ. 55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ డీలర్‌షిప్ ద్వారా అందించబడుతోంది. కాబట్టి తగ్గింపు ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. సోనెట్ ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
Kia కేరెన్స్‌ని పై 95 వేల తగ్గింపు
మీరు ఈ నెలలో కియా కుటుంబ కారు కేరెన్స్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే డీలర్‌షిప్ స్థాయిలో ఈ కొత్త, పాత స్టాక్‌పై రూ. 52 వేల నుండి దాదాపు రూ. 95 వేల వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. కేరెన్స్ 7 సీట్ల MPV. దీని ధర రూ.10.52 లక్షల నుంచి రూ.19.94 లక్షల వరకు ఉంది. మీరు ఈ మూడు వాహనాల్లో ఏదో ఒక్క వావానాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కియా షోరూమ్‌ని సంప్రదించండి. ఈ ఆఫర్లన్నీ ఈ నెల లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కూడా గమనించాలి.