Best Mileage Cars: భారతదేశంలో అధిక మైలేజ్‌తో పాటు తక్కువ ధరకు లభించే కార్లు ఇవే!
మారుతి సుజుకి సెలెరియో దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటి. దీని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 26.68 కిలోమీటర్లు, CNG వేరియంట్ కిలోగ్రామ్‌కు 34.43 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
- By Gopichand Published Date - 12:20 PM, Sun - 29 June 25

Best Mileage Cars: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో లభించే, అధిక మైలేజ్ ఇచ్చే కార్లను (Best Mileage Cars) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఆర్టికల్‌లో అద్భుతమైన ఇంధన సామర్థ్యం కలిగిన కార్ల గురించి తెలుసుకుందాం. ఈ కార్లలో మారుతి సెలెరియో నుండి టాటా టియాగో వరకు ఉన్నాయి.
మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటి. దీని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 26.68 కిలోమీటర్లు, CNG వేరియంట్ కిలోగ్రామ్‌కు 34.43 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు. ఈ కారులో 32 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 60 లీటర్ల CNG ట్యాంక్ లభిస్తాయి. దీనిని పూర్తిగా నింపితే 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
మారుతి స్విఫ్ట్
ఈ సెగ్మెంట్‌లో రెండవ కారు మారుతి స్విఫ్ట్. దీని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 24 కిలోమీటర్లు. CNG వేరియంట్ కిలోగ్రామ్‌కు 32.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర భారత మార్కెట్‌లో 6.49 లక్షల రూపాయల నుండి 9.50 లక్షల రూపాయల వరకు ఉంటుంది.
టాటా టియాగో
మూడవ కారు టాటా టియాగో. ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఈ కారు పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 20-23 కిలోమీటర్లు. CNG మోడల్ కిలోగ్రామ్‌కు 28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దేశీయ మార్కెట్‌లో టాటా టియాగో ధర 5 లక్షల రూపాయల నుండి 8.55 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.
టాటా పంచ్
నాల్గవ కారు టాటా పంచ్. ఇది దేశంలో అత్యంత సరసమైన SUV. దీని పెట్రోల్ వేరియంట్ 20 నుండి 21 కిలోమీటర్ల మైలేజ్. CNG మోడల్ కిలోగ్రామ్‌కు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఈ కారు ప్రారంభ ధర 6 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు లభిస్తాయి.
మారుతి సుజుకి డిజైర్
తదుపరి కారు మారుతి సుజుకి డిజైర్. దీనిని దేశంలో అత్యంత సురక్షితమైన సెడాన్‌గా పరిగణిస్తారు. క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు 5-స్టార్ రేటింగ్ లభించింది. దీని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 22-24 కిలోమీటర్లు, CNG వేరియంట్ కిలోగ్రామ్‌కు 33.73 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.