Electric Two-Wheeler Sales: మార్కెట్‌లో ఈ స్కూటర్ డిమాండ్ మామూలుగా లేదుగా!
బజాజ్ ఆటో గత ఏడాది మార్కెట్లోకి కొత్త చేతక్ 35 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. కొత్త చేతక్ మునుపటి కంటే మరింత అధునాతనంగా, స్టైల్‌గా మారింది. దీనితో దాని అమ్మకాలు పెరిగాయి.
- By Gopichand Published Date - 12:48 PM, Wed - 12 March 25

Electric Two-Wheeler Sales: బజాజ్ చేతక్ ఈసారి జోరు చూపింది. గత నెల (ఫిబ్రవరి 2025) బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Two-Wheeler Sales) చేతక్ 21,387 యూనిట్లను విక్రయించింది. దీనితో ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా నిలిచింది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో చేతక్ స్కూటర్ 11,764 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. గత సంవత్సరంతో పోలిస్తే కంపెనీ ఈ స్కూటర్‌ను 9625 యూనిట్లు ఎక్కువగా విక్రయించింది. దీనితో ఈ స్కూటర్ వృద్ధి 81.82%, కాగా ఫిబ్రవరి నెలలో దాని మార్కెట్ వాటా 28.11%. బజాజ్ చేతక్ స్కూటర్‌కు ఇప్పుడు భారతదేశంలో డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
ఓలా, టీవీఎస్‌ని వెనుకకు నెట్టింది
TVS iQube గత నెలలో 18,762 యూనిట్లు విక్రయించి, అమ్మకాలలో రెండవ స్థానంలో నిలిచింది. ఇది కాకుండా అథర్ మూడవ స్థానాన్ని ఆక్రమించింది. 8,647 స్కూటర్లను విక్రయించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగో స్థానంలో ఉంది. ఓలా మొత్తం 8,647 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి.
Also Read: Telangana Assembly : తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ : గవర్నర్ జిష్ణుదేవ్
బజాజ్ ఆటో గత ఏడాది మార్కెట్లోకి కొత్త చేతక్ 35 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. కొత్త చేతక్ మునుపటి కంటే మరింత అధునాతనంగా, స్టైల్‌గా మారింది. దీనితో దాని అమ్మకాలు పెరిగాయి. ఈ స్కూటర్‌లో అనేక కొత్త, ముఖ్యమైన ఫీచర్లు కూడా చేర్చబడ్డాయి. కొత్త చేతక్ 35 సిరీస్‌లో 3.5 kWh అండర్‌ఫ్లోర్ బ్యాటరీ ప్యాక్ ఉంది.
బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు దాని రియల్ టైమ్ రేంజ్ 125 కిమీ అయితే 153 కిమీ పరిధిని కలిగి ఉంటుంది. ఇందులో 950W ఆన్‌బోర్డ్ ఛార్జర్ సౌకర్యం కూడా ఉంది. కేవలం 3 గంటల్లో దాని బ్యాటరీ 80% వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ మొత్తం రెండు వేరియంట్లలో విడుదల చేశారు. దీని బేస్ వేరియంట్ (3502) ధర రూ. 1,20,00 కాగా, టాప్ వేరియంట్ (3501) ధర రూ. 1,27,243గా ఉంది.