Bajaj New Motorcycles : బజాజ్ నుంచి రెండు కొత్త 400 సీసీ బైక్స్.. ఫీచర్లు ఇవే
మొత్తం మీద బజాజ్ ఆటో కంపెనీ(Bajaj New Motorcycles) హీరో, హోండాలను ఢీకొనేందుకు బ్రిటీష్ కంపెనీతో జట్టు కట్టి సరికొత్త ఫీచర్లను వాహన ప్రియులకు అందించే పనిలో నిమగ్నమైంది.
- By Pasha Published Date - 04:18 PM, Tue - 17 September 24

Bajaj New Motorcycles : బజాజ్ ఆటో కంపెనీ బ్రిటీష్ మోటార్ సైకిల్ కంపెనీ ట్రయంఫ్‌తో కలిసి మరో రెండు కొత్త బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. వాటిపేర్లు.. ట్రయంఫ్ స్పీడ్ టీ4, స్పీడ్ 400 ఎంవై25. ఈ రెండు బైక్స్ కూడా 400 సీసీ ఇంజిన్‌తో లభిస్తాయి. స్పీడ్ టీ4 ఎక్స్ షోరూం ధర రూ.2.17 లక్షలు. స్పీడ్ 400 ఎంవై25 ఎక్స్ షోరూం ధర రూ.2.40 లక్షలు.
Also Read :Man Control Alexa : మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు.. ఎలా అంటే ?
ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్ గురించి..
- ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్‌లో లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ యూనిట్ ఉంటాయి.
- 7000 ఆర్‌పీఎం వద్ద 30.6 బీహెచ్‌పీ పవర్‌ను ఈ బైక్ ఉత్పత్తి చేస్తుంది. 5000 ఆర్‌పీఎం వద్ద 36ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ఈ బైక్ గరిష్ఠంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగలదు.
- 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో ఉంటాయి.
- ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ బైకులో ఉన్నాయి.
- ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్ మూడు రంగుల్లో లభిస్తుంది.
- ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, 17 అంగుళాల అలాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్ ఈ బైకులో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
- 43 మిల్లీమీటర్ల టెలీస్కోపిక్ ఫోర్క్స్ ఈ బైకులో అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్‌ను అందిస్తాయి.
- ఈ బైకు ముందు భాగంలో బ్రేకింగ్ కోసం 300 మిల్లీమీటర్ల డిస్క్ ఉంటుంది. వెనుక భాగంలో బ్రేకింగ్ కోసం 230 మిల్లీమీటర్ల డిస్క్ ఉంటుంది. బైకర్ సేఫ్టీ కోసం ఈ బైకులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వ్యవస్థ ఏర్పాటై ఉంది.
- మొత్తం మీద బజాజ్ ఆటో కంపెనీ(Bajaj New Motorcycles) హీరో, హోండాలను ఢీకొనేందుకు బ్రిటీష్ కంపెనీతో జట్టు కట్టి సరికొత్త ఫీచర్లను వాహన ప్రియులకు అందించే పనిలో నిమగ్నమైంది. ఈక్రమంలోనే ఈ రెండు బైక్స్‌ను విడుదల చేసింది.
- ఈ ఏడాది చివరికల్లా ఈ సరికొత్త బైక్స్ మంచిసేల్స్‌ను సాధించిపెడతాయనే ఆశాభావంతో బజాజ్ ఆటో ఉంది.