Ather Electric Scooter: భారత మార్కెట్ లోకి కొత్త ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఫీచర్స్ ఇవే?
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. అంతా బాగానే ఉంది
- By Anshu Published Date - 07:30 PM, Fri - 2 June 23

మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ వాటి ధర కాస్త అధికంగా ఉండటంతో సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో అన్ని కంపెనీలు తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీదారు ఏథర్ కూడా దీనిపైనే అధిక ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్ ను తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చిన ఏథర్ తాజాగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఏథర్ ఎనర్జీ భారతదేశంలో కొత్త ఏథర్ 450ఎస్‌ను విడుదల చేసింది. ఫేమ్-II సబ్సిడీ కోతతో ఈవీల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఏథర్ 450ఎస్ పేరుతో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,29,999గా నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్‌లను కూడా షురూ చేసింది. తమ 450 ఎస్ IDC, 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పరిధి 115 కి.మీ. రేంజ్ ఇస్తుందని సంస్థ తెలిపింది.
అలాగే గంటకు 90 కి.మీ వేగంతో అత్యుత్తమ సాంకేతికత, పనితీరును అందిస్తుందని ఏథర్ ఎనర్జీ కో-ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా వెల్లడించారు. ఫేమ్-II ఫ్రేమ్‌వర్క్ కింద తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 450 ఎక్స్ కొత్త ధరలను కూడా ప్రకటించింది. మునుపటి ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 1,65,000 కి అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ ప్రో ప్యాక్ ఏథర్ 450 ఎక్స్ రూ. 1.45 లక్షల నుండి రూ. 1.65 లక్షల వరకు ఉంటుంది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ. 32,000 వరకు పెరిగింది.