Cars On Amazon : అమెజాన్‌లో కార్ల సేల్స్.. ఎప్పటి నుంచి ?
Cars On Amazon : అమెజాన్ మరో అందలం ఎక్కింది. ఇక అమెజాన్‌లో కార్లు కూడా ఆర్డర్ చేయొచ్చు.
- Author : Pasha
Date : 18-11-2023 - 10:06 IST
Published By : Hashtagu Telugu Desk
Cars On Amazon : అమెజాన్ మరో అందలం ఎక్కింది. ఇక అమెజాన్‌లో కార్లు కూడా ఆర్డర్ చేయొచ్చు. ఔను.. ఇది నిజమే. అయితే మన దేశంలో ఇంకా కార్ల సేల్స్‌ను అమెజాన్ ప్రారంభించలేదు. అమెరికాలోని తమ వెబ్‌సైట్‌లో కార్ల సేల్స్‌ను ప్రారంభించామని అమెజాన్ ప్రకటించింది. ‘ఎవ్రీథింగ్ స్టోర్’గా అమెజాన్‌ను మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అమెరికాలోని యూజర్స్ 2024 సంవత్సరం నుంచి అమెజాన్‌లో రిజిస్టర్ చేసుకున్న డీలర్ల నుంచి కార్లకు ఆర్డర్లు ఇవ్వొచ్చని వెల్లడించింది. అయితే తొలి విడతలో అమెజాన్‌లో ‘హ్యుందాయ్’ బ్రాండ్ కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఆన్‌లైన్‌లో కార్ల విక్రయాలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఆన్‌లైన్‌లో కార్ల సేల్స్ పెరుగుతాయని అమెజాన్ అంచనా వేస్తోంది. మరోవైపు అమెరికాలో తమ సేల్స్ పెరగడానికి అమెజాన్ ప్లాట్‌ఫామ్ దోహదం చేస్తుందని హ్యుందాయ్ మోటార్ కో ప్రెసిడెంట్ జేహూన్ (జే) చాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెజాన్‌కు చెందిన వర్చువల్ అసిస్టెంట్ ‘అలెక్సా’ 2025 నుంచి హ్యుందాయ్ కొత్త కార్లలో విలీనం చేయబడుతుంది. అంతేకాదు.. అమెజాన్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను కూడా హ్యుందాయ్(Cars On Amazon) వాడుకోనుంది.