Reliance Capital – IndusInd : ‘ఇండస్ ఇండ్’ చేతికి రిలయన్స్ క్యాపిటల్
Reliance Capital - IndusInd : వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.
- By pasha Published Date - 09:34 AM, Sat - 18 November 23

Reliance Capital – IndusInd : వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌కు సంబంధించిన దివాలా వివాదానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెరదించింది. రిలయన్స్ క్యాపిటల్‌ను రూ.9,650 కోట్లకు కొనేందుకు హిందూజా గ్రూప్‌కు చెందిన ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL) కంపెనీ దాఖలు చేసిన బిడ్‌కు ఆర్బీఐ ఓకే చెప్పింది. దీంతో రిలయన్స్ క్యాపిటల్‌ను కైవసం చేసుకునేందుకు ఇండస్ ఇండ్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వై.నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా ఆర్బీఐ నియమించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు.. ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు చెందినదే. భవిష్యత్తులో రిలయన్స్ క్యాపిటల్‌ను అందులో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రిలయన్స్ క్యాపిటల్‌ను 1986లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)గా స్థాపించారు. ఈ కంపెనీ రుణాలు, బీమా, ఆస్తి నిర్వహణ వంటి అనేక రకాల ఆర్థిక సేవలను అందించేది. రిలయన్స్ క్యాపిటల్ అప్పులను తిరిగి చెల్లించలేక దివాలా తీసింది. దీంతో 2021 నవంబర్‌లో రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఒక నిర్వాహకుడిని ఆర్బీఐ నియమించింది. 2023 ఏప్రిల్‌లో రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ వేలంపాట జరిగింది. దీనిలో టాప్ బిడ్డర్‌గా ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL) నిలిచింది. రిలయన్స్ క్యాపిటల్‌ను కొనేందుకు రూ.9,650 కోట్లు చెల్లిస్తామని ఐఐహెచ్ఎల్ ఆఫర్ చేసింది. ఆ ఆఫర్‌ను తాజాగా శుక్రవారం ఆర్బీఐ (Reliance Capital – IndusInd) ఆమోదించింది.
Also Read: Jaundice: పిల్లల్లో కామెర్ల లక్షణాలు ఇవే.. ఇంటి చిట్కాల ద్వారా కామెర్లు నయం చేయండిలా..!
Related News

Digital Loans : డిజిటల్ లోన్స్‌పై కేంద్ర సర్కారు కీలక అప్‌డేట్
Digital Loans : డిజిటల్ లోన్స్ హవా నడుస్తోంది. చాలామంది ఎగబడి వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు.