HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >2025 Royal Enfield Classic 350 To Be Launched Soon See What To Expect

Royal Enfield Classic 350: అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎలా ఉండబోతుందో తెలుసా?

అత్యాధునిక ఫీచర్లతో అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మార్కెట్లోకి విడుదల కానుంది.

  • By Anshu Published Date - 04:30 PM, Sun - 11 August 24
  • daily-hunt
Royal Enfield Classic 350
Royal Enfield Classic 350

రాయల్ ఎన్​ఫీల్డ్.. ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే కంపెనీలలో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఒకటి. చాలామంది ఈ బైక్స్ ని ఇష్టపడుతున్నప్పటికీ వాటి ధరల కారణంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఎప్పటికప్పుడు తక్కువ దరకే ఈ బైక్స్ ని అందించడంతోపాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన బైక్స్ కి పోటీగా మరికొన్ని బైకులను విడుదల చేస్తోంది. అందులో భాగంగానే రాయల్ ఎన్​ఫీల్డ్​ తన క్లాసిక్ 350 బైర్​ని 2024 ఆగస్టు 12 న విడుదల చేయనుంది. అయితే కొత్త క్లాసిక్​ 350లో పలు కీలక అప్డేట్స్​ కనిపిస్తాయని సమాచారం.

మార్కెట్ లో ఉన్న చాలా రకాల బైక్స్ కీ పోటీనిచ్చే విధంగా మోడల్​ ను మరింత సముచితంగా ఉంచడానికి అనేక అట్రాక్టివ్​ ఫీచర్ మార్పులతో రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 వస్తుందని తెలుస్తోంది. గత నెలలో బ్రాండ్ వాల్యూమ్స్​ లో ఎనిమిది శాతం క్షీణతను చూసినందున, అమ్మకాలు పెంచుకునేందుకు పండుగ సీజన్​ కి ముందు​ ఈ అప్డేట్​ని సంస్థ తీసుకొస్తోంది. కాగా అప్డేటెడ్​ రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350లో అదే డిజైన్ ఉండనుంది. కొద్దిగా స్టైలింగ్ మార్పులను పొందవచ్చు. కొత్త పెయింట్ ఆప్షన్స్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ సహా సవరించిన ఫీచర్ల జాబితా బయటకు రావచ్చని తెలుస్తోంది. మోడ్రన్ క్లాసిక్ మోటార్ సైకిల్ టాప్ వేరియంట్ లలో చాలా కొత్త ఫీచర్లతో సవరించిన వేరియంట్ లైనప్ ను పొందుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్ మరింత సమాచారంతో అప్​గ్రేడ్​ కూడా పొందవచ్చు. ఈ మోడల్ తన తాజా అవతారంలో డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి వివరాలను పొందవచ్చు. అంతేకాక, టాప్ ఎండ్ క్లాసిక్ 350లోని ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ ప్రస్తుత మోడల్ కంటే మరింత సమర్థవంతంగా పనిచేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది ఈ సంస్థ. ఇకపోతే 2025 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 మెకానికల్స్​లో పెద్ద మార్పులను ఆశించవద్దు. ఈ అప్డేటెడ్ బైక్ జే సిరీస్ 349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్​ ను ఉపయోగిస్తుంది. ఇది 6,100 ఆర్​పీఎమ్ వద్ద 20.2 బీహెచ్​పీ పవర్, 4,000 ఆర్​పీఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఈ బైక్ ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులతో కూడిన ట్విన్ డౌన్​ట్యూబ్​ స్పైన్ ఫ్రేమ్, వెనుక భాగంలో 6 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జెస్టిబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ పనితీరు 300 మిమీ ఫ్రెంట్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్​తో 270 ఎంఎం రేర్ డిస్క్, వెనుక భాగంలో 153 మిమీ డ్రమ్ బ్రేక్​తో బేస్ ట్రిమ్స్​లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఆప్షన్​ ను కూడా రాయల్​ ఎన్​ఫీల్డ్​ అందిస్తుంది. కొత్త క్లాసిక్ 350 19-ఇంచ్​ ఫ్రెంట్, 18 ఇంచ్​ రేర్​ స్పోక్డ్ వీల్స్​తో కొనసాగుతుందని ఆశించవచ్చు. అయితే తయారీదారు అల్లాయ్ వీల్ వేరియంట్లను అప్డేట్​ చేయవచ్చు. ఇకపోతే ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 ధర రూ .1.93 లక్షల నుంచి రూ .2.25 లక్షల వరకు ఉంది. తాజా మోడల్​తో ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • price
  • Royal Enfield Classic 350
  • Royal Enfield Classic 350 bike

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd