Yuvagalam : పప్పు నుంచి పవర్ ఫుల్! లోకేష్ `డైట్` సీక్రెట్స్ !
కప్పుడు లావుగా బొద్దుగా ఉండే కుర్రాడు(Yuvagalam). చూడ్డానికి అమాయకంగా(Lokesh)
- By CS Rao Updated On - 01:09 PM, Wed - 8 March 23

ఒకప్పుడు లావుగా బొద్దుగా ఉండే కుర్రాడు(Yuvagalam). చూడ్డానికి అమాయకంగా(Lokesh) ల్యాప్ టాప్ పట్టుకుని అటూఇటూ తిరుగుతూ కనిపించే రోజులవి. అందుకే, మొద్దబ్బాయని కొందరు, పప్పు అంటూ ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. సీన్ కట్ చేస్తే, టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కొలిమిలో కాల్చిన ఇనుములా భగభగ మండిపోతున్నారు. అధికారంలోని వైసీపీ మీద ఆ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిపైన పదునైన రాజకీయ బాణాలను వదులుతూ శత్రువులకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఆయనెవరో కాదు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం సారథి నారా లోకేష్.
యువగళం సారథి నారా లోకేష్ డైట్ (Yuvagalam)
లోకేష్ (Lokesh) క్లాస్ లుక్..మాస్ అప్పీల్ వెనక సీక్రెట్ ఏమిటి? డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఇంతలా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్లు ఎవరు? పప్పు కాస్తా, నిప్పులా ఎలా అయ్యారు? అనేది ఇప్పుడు వైసీపీలోని అంతర్గత టాక్. ప్రస్తుతం నారా లోకేష్ క్లాస్ లుక్‌తో అలరిస్తున్నారు. మాస్ అప్పీల్ తో అదరగొడుతున్నారు. నడకలో వేగం, స్పందించే తీరు ఆకట్టుకుంటోంది. యువగళం(Yuvagalam) ప్రారంభమై నెల దాటినా విసుగు లేకుండా ప్రతీ రోజూ ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. అందుకే, లోకేష్ ఎనర్జీ లెవల్స్ మీద ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది.
లోకేష్ ఎనర్జీ లెవల్స్. క్లారిటీ
పాదయాత్రలో లోకేష్(Lokesh) తో నడవాలంటే పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఆయనతో కలిసి నడుస్తోన్న యువనేతలు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా లోకేష్ తో అడుగులు వేసిన వంగవీటి రాధా అబ్బురపడ్డారట. ఆయనతో కలిసి స్పీడుగా నడిచేందుకు రాధా సైతం ఇబ్బంది పడ్డారని యువగళం టీమ్ అభిప్రాయం. యూత్ ఇంటరాక్షన్‌లో తన లుక్, స్టైల్ అన్నీ మారడానికి భార్య బ్రాహ్మణి కారణమని ఇటీవల లోకేష్ చెప్పుకొచ్చారు. డైట్ ప్లాన్, ఫిట్నెస్ వ్యవహారాలన్నీ భార్యే చూస్తోందని వెల్లడించారు. తాను ఎక్కడ ఏం తిన్నా తెలిసిపోతుందని నవ్వుతూ వివరించారు. అయినప్పటికీ లోకేష్ ఎనర్జీ లెవల్స్ చూసి ఆయన ఏం తింటారు అనే ఆసక్తి చాలా మందిలో మొదలైంది. దీనిపై ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేవరకూ యువగళంలో(Yuvagalam) లోకేష్ దినచర్య ఇలా ఉంది.
Also Read : Yuvagalam : US`టౌన్ హాల్` తరహాలో `హలో లోకేశ్`!భార్య దిద్దిన పొలిటీషియన్!
ఉదయం
క్యాంప్ సైటులో ఉదయం 6 గంటలకల్లా నిద్రలేస్తారు. 6.30కి ఫ్రెష్ అయిన తరువాత బ్లాక్ కాఫీ తాగుతారు. 7:00 గంటల వరకూ పేపర్లు, పీఆర్ టీమ్ బ్రీఫింగ్ ఉంటుంది. అరగంట పాటు అంటే 7.30 వరకూ వ్యాయామం చేస్తారు. 7:50కి స్నానం చేసి రెడీ అవుతారు. 7:50 నుంచి 8:00 వరకూ అల్పాహారం ఉంటుంది. ఆ తరుఆత 8:30 వరకూ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహణ. రోజూ ఉదయం 9:30 సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం తరువాత పాదయాత్ర (Yuvagalam) ప్రారంభం అవుతుంది. ఈ టైము వరకూ లీటర్ వాటర్ తీసుకుంటారు.
Also Read : Nara Lokesh: కట్టేది చంద్రబాబు.. కూల్చేది జగన్ రెడ్డి: నారా లోకేశ్
మధ్యాహ్నం
12.00 గంటలకు కోకోనట్ వాటర్ తీసుకుంటారు. మధ్నాహ్నం 1:00- 1:30 మధ్యాహ్న భోజనం (క్వినోవా విత్ వెజిటబుల్స్) అల్లం టీ, మధ్నాహ్నం 1:30-2:00 నాయకులతో భేటీ తరువాత పాదయాత్ర ప్రారంభమవుతోంది. సాయంత్రంలోగా మరో లీటర్ వరకూ నీరు తాగుతారు. సాయంత్రం 5.00 గంటల కోకోనట్ వాటర్ తాగుతారు. రాత్రి 7:00 విడిది కేంద్రానికి చేరుకుంటారు. రాత్రి 7:30 నాయకులతో(Lokesh) సమీక్ష ఉంటుంది. రాత్రి 8PM to 8:30PM – చాలా లైట్‌గా ఒక చిన్న కప్పుతో డైట్ తీసుకుంటారు ( ఒక రోజు ఉడకబెట్టిన వెజిటబుల్స్ మరో రోజు ఉడకబెట్టిన గుడ్డు , ఇంకో రోజు ఉడకబెట్టిన చికెన్ )
అనూహ్యంగా లోకేష్ గ్రాఫ్ పెరడంతో పాటు..(Lokesh)
ఇలా నారా లోకేష్ యువగళం(Yuvagalam)లోని డైట్, వ్యాయామం, నిద్ర ప్లాన్. అందుకే, ఆయన పరుగులు పెడుతున్నారు. ఆయనతో నడిచే వాళ్లను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకప్పుడు తిండిబోతుగా లోకేష్ ను ప్రత్యర్థులు చిత్రీకరించారు. అధికారంలో ఉన్నప్పుడు తిండి కోసం లక్షలు ఖర్చు పెట్టారని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బిల్లులను బయటకు తీసింది. పప్పు ముద్ర వేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. వ్యూహాత్మకంగా ఆయన గ్రాఫ్ ను జీరోకు తీసుకెళ్లాలని వైసీపీ నేతలు ప్రయత్నం చేశారు. కానీ, అనూహ్యంగా ఆయన గ్రాఫ్ పెరడంతో పాటు ఆయన(Lokesh) చురుకుదనం, నడక, మాటల తూటాలు వైసీపీ నేతల్ని కలవర పెడుతున్నాయని టీడీపీ నమ్ముతుంది.
Also Read : Lokesh Calls Jr.NTR: టీడీపీ సంచలనం.. జూనియర్ NTRకు లోకేష్ పిలుపు!

Related News

Nara Lokesh : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూర్తయిన నారా లోకేష్ పాదయాత్ర.. అనంతపురం జిల్లాలోకి ప్రవేశం
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూర్తయింది. 45 రోజుల పాటు 14 నియోజకవర్గాల్లో నారా