HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Mla Annabathuni Sivakumar House Arrest In Polling Day May 13

YCP MLA House Arrest: వైసీపీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివ కుమార్‌ హౌస్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ రోజున తెనాలి వైసీపీ ఎమ్మెల్యే రాద్ధాంతం తీవ్ర చర్చకు దారి తీసింది. ఓటర్ పై చేసి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పై ఈసీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో అతనిని గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2024 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YCP MLA House Arrest
YCP MLA House Arrest

YCP MLA House Arrest: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ రోజున తెనాలి వైసీపీ ఎమ్మెల్యే రాద్ధాంతం తీవ్ర చర్చకు దారి తీసింది. ఓటర్ పై చేసి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పై ఈసీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో అతనిని గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు, ఓ సాధారణ ఓటరుకు మధ్య జరిగిన భౌతిక వాగ్వాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో శివకుమార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోలింగ్ ముగిసే వరకు గృహనిర్బంధం చేయాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే శివకుమార్ తన పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వెళ్లారు. అయితే, ఆయన క్యూను దాటవేసి పోలింగ్ బూత్ వైపు వెళ్లారు. సుధాకర్ (55) అనే సాధారణ ఓటరు శివకుమార్‌ను ఎదురించి క్యూలో నిలబడమని అడిగాడు. సుధాకర్ ప్రశ్నకు ఆగ్రహించిన ఎమ్మెల్యే శివకుమార్ అతని చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే స్పందించిన సుధాకర్‌ శివకుమార్‌ను తిరిగి కొట్టాడు. కాగా ఓటర్లు, శివకుమార్‌ మద్దతుదారులు పరస్పరం భౌతికదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాయపడిన సుధాకర్‌ను ఆస్పత్రికి బదులు పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శివకుమార్‌పై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పోలింగ్ ముగిసే వరకు గృహనిర్బంధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: AP Poll: ఓటు వేసిన ప్రఖ్యాత ఆర్థోపెడెషియన్ డాక్టర్ దశరథ రామ్ రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Annabathuni Sivakumar
  • AP Eelections 2024
  • House Arrest
  • Sivakumar
  • voter
  • YCP MLA Slaps
  • YSRCP MLA

Related News

    Latest News

    • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

    • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

    • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

    • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

    • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd