AP Poll: ఓటు వేసిన ప్రఖ్యాత ఆర్థోపెడెషియన్ డాక్టర్ దశరథ రామ్ రెడ్డి
యశోద ఆస్పత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరధ రామారెడ్డి (Dr Dasaradha Rama Reddy) సైతం కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
- Author : Sudheer
Date : 13-05-2024 - 3:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని కొన్ని చోట్ల పలు ఉద్రిక్తతలు జరిగినప్పటికీ ఓటర్లు మాత్రం పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి పోలింగ్ శాతం రికార్డు నమోదు కాబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఉదయం 07 నుండే పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారే కాదు ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్ర వారు కూడా ఈసారి ఓటు వేసేందుకు రావడం , అదికూడా వేలసంఖ్యలో హాజరుకావడం అందర్నీ ఆశ్చర్యం వేస్తుంది. ఇదే క్రమంలో యశోద ఆస్పత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరధ రామారెడ్డి (Dr Dasaradha Rama Reddy) సైతం కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఏపీలో 62 శాతం పైగా ఓటింగ్ జరిగింది. ఇంకా పోలింగ్ కు రెండు గంటలు ఉండడంతో ఈ రెండు గంటల్లో మరింతగా పోలింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది. పోలింగ్ సమయం పూర్తి అయ్యేలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పిస్తాం అని అధికారులు చెపుతున్నారు.
Read Also : Madhavi Latha : ముస్లిం మహిళలను తనిఖీ చేసిన మాధవీలత.. ఎఫ్ఐఆర్ నమోదు