YCP MLA: వైసీపీ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం
చింతలపూడి ఎమ్మెల్యే (MLA) ఎలీజాకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఎమ్మెల్యే (MLA) కారు కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. అయితే కార్‌లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే ఎలీజా, కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.
- Author : Gopichand
Date : 20-12-2022 - 8:56 IST
Published By : Hashtagu Telugu Desk
చింతలపూడి ఎమ్మెల్యే (MLA) ఎలీజాకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఎమ్మెల్యే (MLA) కారు కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. అయితే కార్‌లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే ఎలీజా, కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఎమ్మెల్యే ఎలీజా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి చింతలపూడి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనంతరం మరొక కారులో జంగారెడ్డి గూడెం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే కుటుంబం చేరుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.