Vijayasai Reddy: కేసీఆర్ పై ఎత్తుకు చిత్తై… విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్..!!
- Author : hashtagu
Date : 01-11-2022 - 12:33 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ.. టీడీపీ, ఈనాడులపై మండిపడ్డారు. కేసీఆర్ పై ఎత్తుకు చిత్తై అంటూ ట్వీట్ చేశారు. నారా బాబు పిరికితనంతో లోంగిపోయారు… పలాయనం చిత్తగించారని పెద్ద బాకారాయుడు అలియస్ కులరాజగురు రాము తన సొంత పేపర్లోనే కీర్తించారు. ఎలాంటి తప్పులు చేయకపోతే నక్కజిత్తుల నారావారు భయపడాల్సిన అవసరం ఏముంటుంది? చాలా వివరంగా విడమరిచినట్లుగా అని చురుకలు అంటించారు.
ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడంతోపాటు కొంతమందిని ప్రక్షాళనలో భాగంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే… అయ్యో మాకున్న స్లీపర్ సెల్ కూడా లేకుండా పోయే.. ఇప్పుడేలా అంటూ తెలుగు దొంగల పార్టీ శోకాలు పెట్టడేమేంటో అని సెటైర్ వేశారు. పప్పు నాయుడు కూడా ఆగకుండా పరుగెత్తి మోకాళ్ల నొప్పులు, మెదడులో చిప్ పర్ఫెక్టుగా ఉన్నాయని నిరూపించుకోవాలన్నారు.
కేసిఆర్ పైఎత్తుకు చిత్తై
నారా బాబు పిరికితనంతో లొంగిపోయాడని, పలాయనం చిత్తగించాడని "పెద్దబాకారాయుడు" alias కులరాజగురు రాము తన సొంత పేపర్లోనే “కీర్తించారు”. తప్పు చేయకపోతే నక్కజిత్తుల నారా భయపడాల్సిన అవసరం ఏముంది? చాలా విడమరచి చెప్పినట్లే!!— Vijayasai Reddy V (@VSReddy_MP) November 1, 2022