YS Sunitha Reddy : వైసీపీ కి ఎవ్వరు ఓటు వేయొద్దు – వైఎస్ సునీత
- By Sudheer Published Date - 12:44 PM, Fri - 1 March 24

రాబోయే ఎన్నికల్లో తన అన్న, సీఎం వైఎస్ జగన్ పార్టీకి ఓటేయొద్దని ..హత్యా రాజకీయాలు చేసేవారు పాలించకూడదు అంటూ వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదు. నిందితులకు శిక్ష పడాల్సిందే అని వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) న్యాయ పోరాటం చేస్తూనే ఉన్న ఇంతవరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ లో ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేసారు.
త్వరలో జరగోయే ఎన్నికల్లో ఎవ్వరు కూడా వైసీపీ పార్టీ కి ఓటు వేయొద్దని కోరారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలే అన్నారు. హత్యా రాజకీయాలు చేసేవారు రాష్ట్రాన్ని పాలించకూడదు.. ఈసారి ఎన్నికల్లో తనకు ప్రజల సహకారం కావాలని.. ప్రజలు ఓటు ద్వారా తీర్పు ఇవ్వాలని కోరారు.
ఇక్కడ రాజకీయం కోసం కాదు.. న్యాయం కోసం తీర్పు ఇవ్వమని కోరారు. మరోసారి తన అన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే తన తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదన్నారు. వైసీపీకి ఓటు వేయొద్దు.. వంచన చేసిన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయొద్దు అని కోరారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిడి ఉందో తనకు తెలియదని.. ఎవరో అడ్డుపడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయకూడదన్నారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు. మనం మాత్రం రియలైజ్ కాలేం. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది..? సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు..? అంటూ ఆమె ప్రశ్నించింది. అవినాష్, భాస్కర్‌రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అని మరోసారి చెప్పుకొచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
‘నేను ఎక్కడికి వెళ్లినా నా తండ్రి హత్యకేసు గురించే అడుగుతున్నారు. ఈ ఐదేళ్లు నా కుటుంబం ఎంతో ఇబ్బంది పడింది. నాకు అండగా నిలిచిన మీడియా, పోలీసు, లాయర్లకు కృతజ్ఞతలు. నాకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాలు. చంద్రబాబు, మహాసేన రాజేష్, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత గఫూర్ వంటి చాలామంది సహకరించారు. నా పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు.
సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుందన్న సునీత, తన తండ్రి హత్య కేసు దర్యాప్తు మాత్రం ఎందుకు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారని, సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం.. ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారు.. హంతకులు మనమధ్యే ఉంటారు.. వాళ్లను కనుక్కోవాలి కదా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసు దర్యాప్తు ఇప్పటికే అక్కడే ఉందన్న సునీత తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని కోరారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితే న్యాయం జరుగుతుందని ఆశించారు.
Read Also : Congress Party: మహారాష్ట్రలో విపక్షాల సీట్ల సర్దుబాటు..కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..!
మార్చురీ వద్ద అవినాష్.. నాతో మాట్లాడారు. పెదనాన్న 11.30 వరకు నాకోసం ప్రచారం చేశారని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుంది. #YSVivekaMurderCase #avinashreddy #ysjagan #YSRCP #AndhraPadesh #HashtagU https://t.co/A0NOfNwPkp pic.twitter.com/XG6Gznh1Sb
— Hashtag U (@HashtaguIn) March 1, 2024
నేను ప్రత్యేకంగా చెప్తున్నా. దయచేసి మా అన్న పార్టీ. వైఎస్సార్సీపీకి ఓటు వేయొద్దండి. ఇంత వంచన చేసిన పార్టీకి ఓటు వేయకండి. #YSVivekaMurderCase #ysjagan #YSRCP #AndhraPadesh #HashtagU https://t.co/A0NOfNwPkp pic.twitter.com/0d7aA2cj5q
— Hashtag U (@HashtaguIn) March 1, 2024