HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Criticisms On Ys Jagan Mohan Reddy

YS Sharmila: ఈ జన్మకు మారరు.. ప‌చ్చ‌కామెర్ల రోగం ఇంకా త‌గ్గ‌లేదా..? జ‌గ‌న్‌పై ష‌ర్మిల ఫైర్‌

ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు.

  • Author : News Desk Date : 07-04-2025 - 10:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

YS Sharmila: మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థ‌ల‌కు ఇంకా ప‌చ్చ‌కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా సీఎం చంద్రబాబు నాయుడు కనిపించడం చాలా బాధాకరం అంటూ జ‌గ‌న్ ను, వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశిస్తూ ష‌ర్మిల‌ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

ష‌ర్మిల ట్వీట్ ప్ర‌కారం.. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లెవేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు..ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయింది అంటూ ష‌ర్మిల విమ‌ర్శించారు.

 

ఎవరికి ఎవరు దత్తపుత్రుడో తెలుసు..
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను ప్ర‌ధాని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ప్యాలెస్ లు కట్టుకున్నారు. సొంత ఖజానాలు నింపుకున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి ఐదేళ్లపాటు మోదాని సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడింది అంటూ వైసీపీపై ష‌ర్మిల విమ‌ర్శ‌లు చేశారు.

 

ఏపీలో బీజేపీ అంటే..?
ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదు. పులి బిడ్డ పులిబిడ్డే. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్‌. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుంది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

 

మా ఆవేద‌న క‌న‌ప‌డ‌క‌పోవ‌డం..
వక్ఫ్ బిల్లుకి మద్దతు పలికి ముస్లింలకు ఇఫ్తార్ విందులో బాబు విషం పెట్టారని చేసిన మా ఆరోపణలు వినపడకపోవడం మీరు చెవిటోళ్లు అనడానికి.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మా ఆవేదన కనపడకపోవడం మీరు గుడ్డోళ్ళు అనడానికి నిదర్శనం. మీకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు.. ? అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు..? మీ నీచపు కుయుక్తులతో, పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్ప‌.. ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం అంటూ వైసీపీపై ష‌ర్మిల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap politics
  • YS Jagan Mohan Reddy
  • ys sharmila

Related News

Andhra Pradesh Earthquake

ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి

Andhra Pradesh Earthquake  ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వ

  • Minister Narayana

    గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

  • Andhra Pradesh Logo

    ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

  • Madanapalle

    మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..

Latest News

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd