HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagans Meeting With A Election Strategist Making Future Plan On Ap Politics

YS Jagan : ఎన్నికల వ్యూహకర్తతో జగన్ భేటీ.. ఫ్యూచర్ ప్లాన్‌పై కసరత్తు

రిషి రాజ్ సింగ్‌ ఇచ్చిన కొన్ని ఐడియాలను మళ్లీ క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా జగన్(YS Jagan)  అడుగులు వేస్తున్నారట.

  • Author : Pasha Date : 23-04-2025 - 7:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan Meeting With Election Strategist Rishi Raj Singh Ap Politics Ysrcp

YS Jagan : 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఘోర పరాజయం ఎదురైంది.  2019 ఎన్నికల్లో అద్భుత ఫలితాన్ని సాధించిన వైఎస్సార్ సీపీకి ఈ ఎన్నికల ఫలితం భారీ షాక్‌ను మిగిల్చింది. ఈ షాక్ నుంచి బయటపడే ప్రయత్నాల్లో వైఎస్ జగన్ ఉన్నారు. ఈక్రమంలోనే ఆయన బలమైన ఫ్యూచర్ ప్లాన్‌ను రెడీ చేయడంపై ఫోకస్ పెట్టారట. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒక ఎన్నికల వ్యూహకర్తతో ప్రస్తుతం జగన్ టచ్‌లో ఉన్నారట. 2019 ఎన్నికల సమయంలో జగన్ కోసం స్వయంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల పనుల నుంచి ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నారు. నాటి నుంచి ఐప్యాక్‌లో కీలక పాత్రలన్నీ రిషి రాజ్‌సింగ్ పోషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున రిషి రాజ్ సింగ్ పనిచేశారు. అయితే రిషి రాజ్ సింగ్ ఇచ్చిన ‘‘వై నాట్ 175’’ ఐడియా వర్కౌట్ కాలేదు. వైసీపీ బోర్లా పడటంతో జగన్ ఖంగుతిన్నారు.  అయినా రిషి రాజ్ సింగ్‌పై జగన్‌కు నమ్మకం పోలేదు.  తాజాగా మరోసారి బెంగళూరు వేదికగా రిషి రాజ్ సింగ్‌‌తో  జగన్ భేటీ అయ్యారట. భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనపై ఇద్దరూ చాలాసేపు మేధోమధనం చేశారట.

Also Read :Hyderabad MLC Election: 112 ఓట్లలో పోలైనవి 88.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ

ఐడియాల అమలు షురూ

రిషి రాజ్ సింగ్‌ ఇచ్చిన కొన్ని ఐడియాలను మళ్లీ క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా జగన్(YS Jagan)  అడుగులు వేస్తున్నారట. ఇందులో భాగంగానే 2024 ఎన్నికల టైంలో  చేసిన తప్పులను జగన్ సరిదిద్దుకుంటున్నారని  సమాచారం. అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, టికెట్ల ఖరారు లో చేసిన ప్రయోగాలు వైఎస్సార్ సీపీని బాగా దెబ్బకొట్టాయి. ఆనాడు అడ్డదిడ్డంగా తీసుకున్న నిర్ణయాల వల్ల దూరమైన నేతలు, వర్గాలకు చేరువ అయ్యేందుకు జగన్ స్కెచ్ గీస్తున్నారు. ఏపీలోని కూటమి సర్కారు చాలా బలంగా ఉన్న అసెంబ్లీ స్థానాల పరిధిలో బలమైన నేతలను జిల్లాల అధ్యక్షులుగా నియమించడంపై జగన్ ఫోకస్ పెట్టారు.

Also Read :Megha Engineering: న్యూక్లియర్ పవర్ రంగంలోకి ‘మేఘా’.. రూ.12,800 కోట్ల కాంట్రాక్ట్

సామాజిక వర్గాలపై ఫోకస్ 

టీడీపీ, జనసేనలకు ఓటుబ్యాంకుగా ఉన్న కీలక సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ అధినేత భావిస్తున్నారట. ప్రధానంగా ఉభయ గోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాల మద్దతును కూడగట్టాలని జగన్ అనుకుంటున్నారట. ఆయా వర్గాలకు పార్టీ పదవులు, కీలక బాధ్యతలను ఇచ్చేందుకూ ఆయన సిద్ధంగా ఉన్నారట. మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి కోసం ఏమేం చేస్తాననే దానిపై జగన్ అడ్వాన్సుగా హామీలు ఇచ్చేస్తున్నారట. వచ్చే నెల(మే) నుంచి తాడేపల్లిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారు. జూన్ నుంచి ఆయన జిల్లాల  పర్యటనలకు వెళ్లనున్నారు. 2019 తరహా సోషల్ ఇంజినీరింగ్ ఫార్ములాతో  వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని ఆయన భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap politics
  • election strategist
  • Rishi Raj Singh
  • ys jagan
  • ysrcp

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • It is because of CM Chandrababu that it is not raining: Former Minister

    Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

  • YS Jagan pays tribute to YSR.

    YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd