Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Ys Jagan Serious Action On Ycp Mp Gorantla Madhav

AP Dirty Politics: నాడు పృథ్వి.. నేడు గోరంట్ల‌, మ‌రి వాళ్లిద్ద‌రు?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అశ్లీల వీడియో వ్య‌వ‌హారంపై నిఘా వ‌ర్గాలు సీఎం జ‌గ‌న్ కు నివేదిక అందించిన‌ట్టు తెలుస్తోంది.

  • By CS Rao Updated On - 02:38 PM, Fri - 5 August 22
AP Dirty Politics: నాడు పృథ్వి.. నేడు గోరంట్ల‌, మ‌రి వాళ్లిద్ద‌రు?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అశ్లీల వీడియో వ్య‌వ‌హారంపై నిఘా వ‌ర్గాలు సీఎం జ‌గ‌న్ కు నివేదిక అందించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి? ఒక వేళ స‌స్సెండ్ చేస్తే వ‌చ్చే ప‌రిణామాలు ఏమిటి? గ‌తంలో బ‌య‌ట‌కొచ్చిన వీడియోల మాటేమిటి? అనే అంశం మీద పార్టీ అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఒక మ‌హిళ‌తో మాట్లాడిన ఆడియో బ‌య‌ట‌కొచ్చిన విష‌యం విదిత‌మే. అర‌గంట అంటూ ఆ లేడీతో మాట్లాడుతూ ర‌సిక సామ్రాజ్యాన్ని ర‌చించారు. ఆ రోజున ఆ వీడియోపై ఆయ‌న స్పందించారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేసిన కుట్ర అంటూ వ్యాఖ్యానించారు. మార్ఫింగ్ అంటూ రాజ‌కీయం చేశారు. కానీ, సీన్ క‌ట్ చేస్తే, రెండో విడ‌త మంత్రివ‌ర్గంలో ఆయ‌న‌కు చోటులేకుండా పోయింది. మంత్రి అంబ‌టి రాంబాబుకు సంబంధించిన ఆడియోలు ప‌లు సంద‌ర్భాల్లో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆయ‌న ఒక లేడీతో ఒక గంటఅన్నీ చేస్తావా? అంటూ అశ్లీల మాట‌ల‌ను రంగ‌రిస్తూ ఉండే ఆడియో అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. ఆ ఆడియో మార్ఫింగ్ అంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. సీన్ కట్ చేస్తే, రెండో విడ‌త మంత్రివ‌ర్గంలో రాంబాబుకు ప‌దోన్న‌తి క‌లిగింది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత వైసీపీకి చెందిన పృద్విరాజ్ అశ్లీల మాట‌ ఆడియో తొలుత బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌ట్లో ఆయ‌న ఎస్వీబీసీ ఛాన‌ల్ చైర్మ‌న్ గా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఒక లేడీ యాంక‌ర్ తో ఫోన్లో మాట్లాడిన ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఆడియో మార్ఫింగ్ అంటూ తొలుత మేక‌పోతుగాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆ త‌రువాత నిఘా వ‌ర్గాల నివేదిక స‌మాచారం ఆధారంగా ఆయ‌న‌పై వైసీపీ చ‌ర్య‌లు తీసుకుంది. ప‌ద‌వికి రాజీనామా చేసి 30ఇయ‌ర్స్ ఇండిస్ట్రీ ఇంటిమొఖం ప‌ట్టారు. ఇప్పుడు జ‌న‌సేన పార్టీలో కీల‌కంగా మార‌బోతున్నారు. ఇప్పుడు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అనేది ఆస‌క్తిక‌రంగా ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మాధ‌వ్ మీద చ‌ర్య‌లు తీసుకోక‌పోతే, పార్టీకి న‌ష్టం వాటిల్లుతుంద‌ని పార్టీలోని వాళ్లు భావిస్తున్నారు. ఆ వీడియో మార్ఫింగ్ అని మాధ‌వ్ చెబుతున్న‌ప్ప‌టికీ నిజం లేద‌ని ప్రాథ‌మికంగా అర్థం అవుతోంది.

ఒక వేళ నిజ‌మ‌ని తేలితే చ‌ర్య‌లు తీసుకోవడానికి సిద్ధ‌మ‌నే సంకేతాలు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే, ఎంపీ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేస్తారా? అనే సందేహం కూడా వైసీపీ వ‌ర్గాల్లో ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉప ఎన్నిక‌ల వ‌స్తే, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఒక వేళ మాధ‌వ్ మీద జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటే, మంత్రి అంబ‌టి రాంబాబు మాట ఏంటి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతుంది. బీసీ నాయ‌కుడు కాబ‌ట్టి మాధ‌వ్ మీద చ‌ర్య‌లు తీసుకున్నారు అనే అప‌వాదును వైసీపీ మోయాల్సి వ‌స్తుంది. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యం కీల‌కం కానుంది.

Tags  

  • Ambati Rambabu
  • ap politics
  • avanthi srinivas
  • Gorantla Madhav
  • nude
  • Prudhvi Raj

Related News

Ysrcp : నారాలోకేశ్ కు సంబంధించి ఆ ఫొటోలను షేర్ చేసిన వైసీపీ నేత…!!

Ysrcp : నారాలోకేశ్ కు సంబంధించి ఆ ఫొటోలను షేర్ చేసిన వైసీపీ నేత…!!

అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

  • MP Gorantla episode: రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేయనున్న ABN ఎండీ వేమూరి రాధాకృష్ణ..!!

    MP Gorantla episode: రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేయనున్న ABN ఎండీ వేమూరి రాధాకృష్ణ..!!

  • MP Clarity : రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ మార్ఫింగ్ చేశారు-ఎంపీ గోరంట్ల..!!

    MP Clarity : రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ మార్ఫింగ్ చేశారు-ఎంపీ గోరంట్ల..!!

  • Gorantla Madhav Video : గోరంట్ల వీడియో ఒరిజిన‌ల్ కాదు.. ఫోరెన్సిక్ నివేదిక‌లో ఏముందంటే..

    Gorantla Madhav Video : గోరంట్ల వీడియో ఒరిజిన‌ల్ కాదు.. ఫోరెన్సిక్ నివేదిక‌లో ఏముందంటే..

  • Gorantla Video For Sale: అమ్మకానికి ‘గోరంట్ల‘ న్యూడ్ వీడియో

    Gorantla Video For Sale: అమ్మకానికి ‘గోరంట్ల‘ న్యూడ్ వీడియో

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: