HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Keen Observation On Chandrababu Naidu Road Show Hit

AP Politics : చంద్ర‌బాబు ఎఫెక్ట్‌, వైసీపీ ప్ర‌క్షాళ‌న‌!

భ‌యం అనేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డిక్ష‌న‌రీలో ఉండ‌దంటారు వైసీపీ లీడ‌ర్లు.

  • Author : CS Rao Date : 24-11-2022 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YCP-CBN
Jagan Babu

భ‌యం అనేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డిక్ష‌న‌రీలో ఉండ‌దంటారు వైసీపీ లీడ‌ర్లు. కానీ, ఆయ‌న ఓట‌మి భ‌యంతో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాడ‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు చెబుతున్నారు. అందుకే ఏకంగా ఎనిమిది జిల్లాల‌ అధ్య‌క్షుల‌ను మార్చేశార‌ని అంటున్నారు. మినీ మ‌హానాడు, బాదుడేబాదుడు, క‌ర్నూలు స‌భ‌కు వ‌చ్చిన స్పంద‌న గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జంకుతున్నార‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులతో స‌మావేశం అయిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు వైసీపీ ప‌రిస్థితిని అంచ‌నా వేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ఆక్వా రంగం అంశాలను చేర్చుతామ‌ని హామీ ఇచ్చిన ఆయ‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ‌యం గురించి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. క‌ర్నూలు స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌జాద‌ర‌ణ చూసిన త‌రువాత 175 స్థానాల్లోనూ టీడీపీ గెలుస్తుంద‌ని అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

తెలుగుదేశం పార్టీకి రాబిన్ సింగ్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉండ‌గా, వైసీపీకి వ్యూహ‌క‌ర్త‌గా రుషిరాజ్ సింగ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇరు పార్టీలు వ్యూహ‌క‌ర్త‌లు ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌ల‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. టిక్కెట్ల విష‌యంలో కూడా వాళ్లిద్ద‌రి స‌ర్వేలను ఆధారంగా చేసుకోబోతున్నారు. ఆ క్ర‌మంలోనే పలు జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులను మార్చుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నార‌ని వైసీపీ చెబుతోంది. తొలగించిన వాళ్లా జాబితాలో సుచరిత (గుంటూరు జిల్లా), ముత్తంశెట్టి శ్రీనివాస్ (విశాఖ), పుష్ప శ్రీవాణి (పార్వతీపురం మన్యం జిల్లా), బుర్రా మధుసూదన్ యాదవ్ (ప్రకాశం జిల్లా), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (తిరుపతి జిల్లా), బాల నాగిరెడ్డి (కర్నూలు జిల్లా) తదితరులను జిల్లా వైసీపీ అధ్యక్ష ప‌ద‌వుల నుంచి తప్పించారు. వాళ్ల గ్రాఫ్ దారుణంగా ఉంద‌ని స‌ర్వేలు తేల్చిన తరువాత మాత్ర‌మే తొలగించార‌ని తెలుస్తోంది. అలాంటి సాహ‌సం చంద్ర‌బాబు చేయ‌గ‌ల‌రా? అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nara Chandrababu Naidu
  • telugu desam party
  • YS Jagan Mohan Reddy
  • ysrcp

Related News

Ys Sharmila

YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి పేర్లను రాజకీయంగా ఉపయోగిస్తున్నారంటూ టీడీపీపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న ప్రచారం రాజకీయ అక్కసుతో చేస్తున్నదేనని ఆమె ఆరోపించారు. దివంగతులపై ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని షర్మిల పేర్కొన్నారు. నిజంగా ఆరోపణల్లో వాస్తవం ఉంటే గతంలో అధికారంలో

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

  • Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh

    Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

  • The Godavari Flows Nearby... Yet Kovvur Faces Drinking Water Crisis

    Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

  • Bhaskar Award Could Be Given to YS Jagan: Nara Lokesh

    Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd