YS Jagan: రాష్ట్రం తిరోగమనంలో ఉంది: వైఎస్ జగన్
ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
- By Latha Suma Published Date - 06:47 PM, Thu - 28 November 24

YS Jagan : కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తోందని, రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోందని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి అని అన్నారు. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉందన్నారు. బడ్జెట్ లో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. సూపర్ సిక్స్ లు అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్నారు.
రాష్ట్రంలో లిక్కర్, సాండ్ స్కాం లు కనపడుతున్నాయి. పేకాట క్లబ్ లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. పాదయాత్రలో నేను గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశాను అన్నారు. . ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో చేయటం లేదు అని మాజీ సీఎం జగన్ అన్నారు. DBT ద్వారా లంచాలు లేకుండా సంక్షేమం అందించాం. అవినీతికి తావులేకుండా సచివాలయాల ద్వారా అన్ని సేవలు ప్రజలకు అందించాం.2.73 లక్షల కోట్లు DBT ద్వారా అవినీతి, వివక్ష లేకుండా మేం ఇచ్ఛాం అన్నారు. . విద్యా, వైద్య శాఖలో అనేక మార్పులు వైసీపీ హయంలో వచ్చాయి అన్నారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టారని జగన్ ధ్వజమెత్తారు. ‘కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్ల ఉద్యోగం పోయింది. సచివాలయ వ్యవస్థ అగమ్యగోచరంగా ఉంది. రూ.2800 కోట్ల విద్యాదీవెన బకాయిలు, రూ.1100 కోట్లు వసతి దీవెన బకాయిలు పెట్టడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదు. 108, 104 పడకేశాయి’ అని ఆరోపించారు.
సెకీతో వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలపై జగన్ స్పందించారు. ‘మనం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం తీపికబురు అందించింది. తక్కువ రేటుకు విద్యుత్ ఇస్తామని సెకీ చెప్పింది. ISTS ఛార్జీలు లేకుండా రూ.2.49కి యూనిట్ విద్యుత్ ఇస్తామంది. రైతుల పట్ల ప్రభుత్వం చూపిన శ్రద్ధను అభినందించింది. ఏపీ చరిత్రలోనే అతి తక్కువ రేటుకు చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఇది. దీనిపై ఆరోపణలా?’ అని జగన్ మండిపడ్డారు.