Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం రెడ్డి పాడె మోసిన Ys జగన్
- Author : Vamsi Chowdary Korata
Date : 15-07-2026 - 4:40 IST
Published By : Hashtagu Telugu Desk
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాడెను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మోశారు. అనంతరం పద్మనాభం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. కాసేపటి క్రితం ముద్రగడ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముద్రగడ పాడెను జగన్, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మోశారు.