Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Yeleswaram Prathipadu Villages Of Andhra In Grip Of Fear Of Tiger

Bengal Tiger Roars: ఏపీలో ‘టైగర్’ టెర్రర్!

ఒకే ఒక పులి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి నాదే.. ఊరు నాదే అంటూ స్వైర విహారం చేస్తోంది.

  • By Balu J Published Date - 04:06 PM, Sat - 11 June 22
Bengal Tiger Roars: ఏపీలో ‘టైగర్’ టెర్రర్!

ఒకే ఒక పులి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి నాదే.. ఊరు నాదే అంటూ స్వైర విహారం చేస్తోంది. ఆవు, మేక, గొర్రె ఏదీ కనిపించినా మీద పడి దాడి చేస్తోంది. ఇక రాత్రి పడితే చాలు గ్రామస్తులు ఎవరూ కూడా గడప దాటేందుకు సాహించడం లేదు. ఇక ఫారెస్ట్ అధికారులకు తలనొప్పిగా మారింది. అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో బెంగాల్ టైగర్ కేసు సవాల్ గా మారింది. పులి కోసం బోను ఏర్పాటుచేసినా చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటోంది. ఈ నేపథ్యంతో కాకినాడ జిల్లా ప్రజలు రాత్రి సమయంలో అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లోని గ్రామాల్లో ఈ మగపులి సంచరిస్తున్నట్లు సమాచారం. జూన్ 8న ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో పగ్ (కాలి) గుర్తులు కనిపించాయి. జూన్ 9న ప్రత్తిపాడు మండలంలో కనిపించినట్టే కనిపించి ఎస్కేప్ అయ్యింది. లింగంపర్తి గ్రామంలో పశువులను చంపేందుకు ప్రయత్నించిందని స్థానికులు బోరున ఏడుస్తూ చెప్పారు.

అయితే జూన్ 7వ తేదీ నుంచి పులికి ఆహారం దొరకడం లేదని పలువురు భావిస్తున్నారు. ప్రత్తిపాడు మండలంలోని పెదశంకరపూడి, వంతాడ, కొండ తిమ్మాపురం, ఉలిగోగుల గ్రామాల్లో తిరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నానికి లింగంపర్తి నుంచి ఒమ్మంగి పొదురుపాకకు పులి కదలికలు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు. మరోవైపు పోతులూరు, ఒమ్మంగి గ్రామాల్లో అటవీశాఖ అధికారులు బోనులు, కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం లింగంపర్తిలో పగ్ గుర్తులు కనిపించాయని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఐకేవీ రాజు తెలిపారు. పులి జాడ కోసం డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించారు. కానీ ఫలించలేదు. దీంతో ఏపీలో బెంగాల్ టైగర్ కేసు మిస్టరీగానే మారింది.

Tags  

  • bengal
  • Forest department
  • kakinada district
  • tiger

Related News

Tribal women: పోడు గోడు.. అడవి బిడ్డలపై అటవీ అధికారుల దాడి!

Tribal women: పోడు గోడు.. అడవి బిడ్డలపై అటవీ అధికారుల దాడి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామంలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య జరిగిన వాగ్వాదంలో

  • Kakinada Tiger Scare: పులి బోనులో ఏపీ!

    Kakinada Tiger Scare: పులి బోనులో ఏపీ!

  • Begger: బిచ్చగాడి రూపంలో చనిపోయిన సాధుపుంగవుడు.. రూపాయి రూపాయి దాచిపెట్టిన ధనం పరులపాలు!

    Begger: బిచ్చగాడి రూపంలో చనిపోయిన సాధుపుంగవుడు.. రూపాయి రూపాయి దాచిపెట్టిన ధనం పరులపాలు!

  • Bengal Tiger: క్షణ క్షణం.. భయం భయం!

    Bengal Tiger: క్షణ క్షణం.. భయం భయం!

  • Andhra Tiger:పెద్దపులిని పట్టుకోవడానికి ఇంత ప్రోటోకాలా? ఏపీలో ఇప్పుడది ఎక్కడుంది?

    Andhra Tiger:పెద్దపులిని పట్టుకోవడానికి ఇంత ప్రోటోకాలా? ఏపీలో ఇప్పుడది ఎక్కడుంది?

Latest News

  • Vastu Tips : విష్ణుప్రియ అపరాజితను ఈ దిక్కున పెట్టండి…ఇంట్లోకి ఐశ్వర్యం తెస్తుంది..!!

  • Reduce Pain: మందు లేకుండానే నొప్పిని తగ్గించే పనికరం.. ఈ వివరాలు తెలుసుకోండి!

  • Vastu tips : భోజనం చేసేటప్పుడు ఏవైపు కూర్చుంటే మంచిదో తెలుసా..:?

  • Sai Baba : గురువారం సాయిబాబాకు పాలాభిషేకం చేస్తే…ఆ దోషాలు తొలగిపోతాయట..!!

  • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

Trending

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: