TDP vs YCP : హిందూపుర్‌లో దూకుడు పెంచిన వైసీపీ.. టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు ప్లాన్
టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపూర్ నియోజకవర్గంపై వైసీపీ గురిపెట్టింది. హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న
- Author : Prasad
Date : 01-02-2024 - 8:13 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపూర్ నియోజకవర్గంపై వైసీపీ గురిపెట్టింది. హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీహీరో నందమూరి బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. మూడోసారి బాలకృష్ణను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకూడదని వైసీపీ టార్గెట్ చేసింది. ఇందుకోసం నియోజకవర్గంలో వైసీపీ కొత్త అభ్యర్థిని తెరమీదకు తెచ్చింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్ నిచ్చెల్‌ని, 2019లో పోటీ చేసిన ఇక్బాల్‌ని కాదని ఈ సారి మహిళా అభ్యర్థిని వైసీపీ బరిలోకి దింపుతోంది. ఎలాగైన టీడీపీ కంచుకోటలో పాగా వేయాలని వైసీపీ ఉవ్విళ్లూరుతుంది. ఈ ఎన్నికల్లో హిందూపూర్ వైసీపీ అభ్యర్థిగా టీఎన్ దీపిక బరిలోకి దిగబోతున్నారు. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న కొత్త ప్రయోగం సక్సెస్ అవుతందా లేదా అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో కొత్త మోహాలను తెరమీదకు తీసుకువచ్చి పోటీ చేయిస్తున్నారు. ఇటు హిందూపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని.. ఆయన జనంలో ఉండరనే ఆరోపణలు వైసీపీ చేస్తుంది.హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఈ ఎన్నికల్లో ముఖ్యనేతల ఓటమే టార్గెట్‌గా ఆయన పని చేస్తున్నారు. వైసీపీ వేవ్‌లో కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడంతో ఈ సారి ఇక్కడ వైసీపీని గెలిపించాలని సీనియర్లు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మహిళ అభ్యర్థిని బరిలోకి దించుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ ఇంఛార్జ్ దీపిక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హిందూపుర్ మున్సిపాలిటీలోని 12వ వార్డు మోడల్ కాలనీ-02 వార్డు సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించి జగనన్న ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి. టిఎన్ దీపికకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలకు వారి కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందేలా చూడడానికి ఈ పథకాల లభ్యత గురించి కూడా ఆమె ఆరా తీశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిత్యం ప్రజల సమస్యల పట్ల శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే వ చ్చే 2024 ఎన్నిక ల్లో మ హిళ ల స మ స్య ల పై దృష్టి సారిస్తానని దీపిక తెలిపారు. హిందూపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బోయ శాంతమ్మను గెలిపించాలని ఆమె కోరారు ప్రస్తావించారు.
Also Read: Interim Budget : సాదాసీదా బడ్జెట్ నే నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతోందా..?