Pawan Prayaschitta Deeksha : పవన్ కళ్యాణ్ చేస్తుంది అసలు దీక్షే కాదు – పోతిన మహేష్
Pawan Prayaschitta Deeksha : అసలు ఆయనకు సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ల మీద మీకు నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు. గొడ్డు మాంసం తినొచ్చని ఒకసారి పవనే అంటారు
- By Sudheer Published Date - 02:17 PM, Tue - 24 September 24

YCP Pothina Mahesh fire on Pawan Kalyan : హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం(Tiruamla Laddu Prasadam)లో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం బయటకు వచ్చిన దగ్గరి నుండి యావత్ హిందువులంతా మనోవేదనకు గురవుతున్నారు. సామాన్య ప్రజలేనే కాదు దేవుడ్ని సైతం మోసం చేసి కల్తీ చేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఈ పాపానికి ఒడికట్టిన వారికీ శిక్షించాలని కోరుతు..ప్రాయశ్చి తాపం కోరుతున్నారు.
లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు కలత చెందిందని.. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని.. చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష (Prayaschitta Deeksha) సైతం మొదలుపెట్టారు. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు పవన్. 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమిస్తారు. దీక్షలో భాగంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఇంత భక్తితో పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తుంటే..ఈ దీక్ష కాదు రాజకీయ దీక్ష అని వైసీపీ నేత పోతన మహేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫై మహేష్ (YCP Pothina Mahesh) సంచలన వ్యాఖ్యలు చేసారు.
లడ్డూలో కల్తీ జరగలేదని స్వయంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఆయన ప్రకటించారు. ఇక.. అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అసలు ఆయనకు సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ల మీద మీకు నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు. గొడ్డు మాంసం తినొచ్చని ఒకసారి పవనే అంటారు. అలాంటిది సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి ? పవన్ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదని.. రాజకీయ దీక్ష అని ఎద్దేవా చేశారు. టీటీడీ దేవాలయాలకు వెళ్లలేని పవన్..సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని మహేష్ సెటైర్లు వేశారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలని, పవన్ మాత్రం మత విశ్వాసాలు అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోతిన మహేష్ మండిపడ్డారు.
పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలనుకుంటే చేయొచ్చు. అసలు ఆ దీక్ష ఎందుకు చేస్తారో ఆయనకుకు తెలుసా.? తప్పును క్షమించమని చేస్తారు. జానీ మాస్టర్ ఓ మైనర్‌పై అఘాయిత్యం చేసినందుకు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నందుకు.. పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నందుకు.. పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ దళిత వైద్యుడిపై దాడి చేసినందుకు ప్రాయశ్చితంగా దీక్ష చేయాలి. చంద్రబాబు తప్పు చేసినందుకు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. హిందువుల మనోభావాలతో ఆటలాడితే వెంకటేశ్వరస్వామి చూస్తూ ఊరుకోరు అని మహేష్ అన్నారు. మహేష్ వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : OpenAI Account Hacked : ‘ఓపెన్ ఏఐ’ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్.. హ్యాకర్లు ఏం పోస్ట్ చేశారంటే..