OpenAI Account Hacked : ‘ఓపెన్ ఏఐ’ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్.. హ్యాకర్లు ఏం పోస్ట్ చేశారంటే..
తద్వారా భవిష్యత్తులో ఓపెన్ ఏఐ(OpenAI Account Hacked) విడుదల చేసే అన్ని రకాల బీటా ప్రోగ్రాంలకు త్వరితగతిన ముందస్తు యాక్సెస్‌ను పొందొచ్చు.
- By Pasha Published Date - 01:48 PM, Tue - 24 September 24

OpenAI Account Hacked : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఛాట్‌బాట్‌ల తయారీ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ గురించి అందరికీ తెలుసు. ‘ఛాట్ జీపీటీ’ పేరుతో ఛాట్ బాట్‌ను తయారు చేసింది ఈ కంపెనీయే. ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ‘ఓపెన్ ఏఐ’ కూడా హ్యాకర్ల చేతికి చిక్కింది. ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన న్యూస్ రూం అధికారిక ‘ఎక్స్’ ఖాతాను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ ఎక్స్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక వెబ్‌సైట్ యూఆర్ఎల్ లింకును పోస్ట్ చేశారు. ‘‘ఓపెన్ ఏఐ యూజర్లు ఈ వెబ్‌సైటులోకి వెళ్లి ఓపెన్ ఏఐ డాలర్ టోకెన్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఓపెన్ ఏఐ(OpenAI Account Hacked) విడుదల చేసే అన్ని రకాల బీటా ప్రోగ్రాంలకు త్వరితగతిన ముందస్తు యాక్సెస్‌ను పొందొచ్చు’’ అని ఆ పోస్టులో హ్యాకర్లు రాసుకొచ్చారు.
Also Read :CM Vs Governor : ముడా స్కాంలో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్య పిటిషన్ కొట్టివేత
ఈ పోస్టులో ఓపెన్ ఏఐ వెబ్ సైట్ ఫేక్ వర్షన్‌ను కూడా చూపించారు. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ ఏఐ కాకుండా మరేదో తప్పుడు సైటులోకి లింక్ వెళ్తోంది. ఇప్పుడు హ్యాక్ అయిన ఓపెన్ ఏఐ న్యూస్ రూం అధికారిక ఎక్స్ అకౌంటుకు దాదాపు 54వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితేే ఈ ఎక్స్ అకౌంటు ఎలా హ్యాక్ అయింది ? అసలేం జరిగింది ? హ్యాక్ చేసిందెవరు ? అనే వివరాలపై ఓపెన్ ఏఐ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఓపెన్ ఏఐ న్యూస్ రూం ఎక్స్ అకౌంటును క్రియేట్ చేశారు. ఇంతలోనే దీనికి భారీగా యూజర్లు వచ్చారు. ఇంత స్వల్ప టైంలోనే హ్యాకర్లు పాస్ వర్డ్‌ను క్రాక్ చేసి.. హ్యాక్ కూడా చేయడం గమనార్హం. ఈనేపథ్యంలో ఓపెన్ ఏఐ కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కంపెనీ భద్రతా విభాగం సిబ్బంది ఓ అంతర్గత మెమోను జారీ చేశారని సమాచారం. ఓపెన్ ఏఐ ఉద్యోగుల ఖాతాలకు హ్యాకింగ్ ముప్పు ఉందని, అలర్ట్‌గా వ్యవహరించాలని సూచించారు.