YCP Leaders Missing : ఎక్కడయ్యా.. శ్రీకాకుళం వైసీపీ నేతలు..?
సీనియర్ నేత తమ్మినేని సీతారాం స్పీకర్‌గా పనిచేయగా, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా మూడేళ్లు కొనసాగారు. మూడేళ్ల క్రితం జరిగిన విస్తరణలో కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిగా అవకాశమిచ్చారు.
- By Sudheer Published Date - 01:03 PM, Tue - 9 July 24

టీడీపీ పార్టీ (TDP) కి కంచుకోట అంటే అది శ్రీకాకుళమే (Srikakulam). ఇక్కడ వార్డ్ మెంబర్ దగ్గరి నుండి ఎమ్మెల్యే వరకు అంత టీడీపీ నేతలే ఉంటారు..అంతలా అక్కడి ప్రజలు పసుపు జెండా కు పట్టం కడుతుంటారు. అలాంటి శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికలు టీడీపీ కి భారీ షాక్ ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర మొత్తం ఫ్యాన్ గాలి వీయడం తో శ్రీకాకుళం ప్రజలు సైతం వైసీపీ కి పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు ఉండగా, వాటిలో 08 స్థానాల్లో వైసీపీ (YCP) అభ్యర్థులే గెలిచారు. టీడీపీ కంచుకోటైన జిల్లాలో వైసీపీకి పట్టం కట్టడం తో ఆ నేతలకు అధిష్టానం కీలక పదవులు అప్పగించింది. స్పీకర్ పదవితోపాటు, డిప్యూటీ సీఎం, రెండు మంత్రి పదవులను ఆ జిల్లా నేతలకే ఇచ్చింది. సీనియర్ నేత తమ్మినేని సీతారాం స్పీకర్‌గా పనిచేయగా, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా మూడేళ్లు కొనసాగారు. మూడేళ్ల క్రితం జరిగిన విస్తరణలో కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిగా అవకాశమిచ్చారు. ఇక పలాస మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కూడా నాలుగున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకర్గాలకు చెందిన దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావుకు ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు. ఇలా కీలక పదవులు ఇవ్వడం తో ఆ నేతలంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా..అందినకాడికి దోచుకోవడం…నిత్యం జగన్ భజన చేయడం తప్ప వారి నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేల దగ్గరి వెళ్లి తన గోడును చెప్పుకున్న పట్టించుకోలేదు. కేవలం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈసారి ఆయా నేతలకు కోలుకోలేని దెబ్బ తీశారు. ఐదేళ్లు కళ్లుమూసుకుని గడిపిన ఓటర్లు..ఈసారి పోలింగ్ బూత్ లో కళ్లుతెరచి కూటమి కి జై కొట్టారు. ఇక ఫలితాలు రావడం ఆలస్యం జిలాల్లో ఒక్క వైసీపీ నేత కూడా కనిపించడం లేదు. గడిచిన ఐదేళ్లు మీడియా ముందు హడావిడి చేస్తూ..జగన్ భజన చేస్తూ..పవన్ కళ్యాణ్ ఫై , చంద్రబాబు ఫై ఇష్టారాజ్యంగా బూతులు తిన్న బూతుల నేతలు ఇప్పుడు కంటికి కూడా కనిపించడం లేదు. ఎక్కడైనా కనిపిస్తారో అని చూసిన కానీ లేకుండాపోయారు.
ఇక కూటమి సర్కార్ కూడా గడిచిన ఐదేళ్లు ఎవరైతే తమపై దాడులు చేసారో..అక్రమాలకు పాల్పడ్డారో..ప్రజల సొమ్ము కాజేసారో వారిపై నిఘా పెట్టింది. ఇప్పటికే పలువురు నేతల తాలూకా అక్రమ కట్టడాలను కూల్చడం..నోటీసులు జారీ చేయడం..పోలీస్ కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తూ వస్తుంది. దీంతో మిగతా నేతల్లో భయం పట్టుకుంది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎవర్ని..ఏ కేసులో అరెస్ట్ చేస్తారో అనే భయం పట్టుకుంది. అందుకే గత ఐదేళ్లలో నోరు పారేసుకున్న నేతలంతా ..ఇప్పుడు అన్ని మూసుకొని సైలెంట్ అయ్యారు. ఏమాట్లాడితే ఏ పాతకేసులు బయటకు తీస్తారో అని భయంతో సొంత పార్టీ నేతలతో , కార్యకర్తలతో కూడా కలవడం కానీ, మాట్లాడడం కానీ చేయడం లేదట. అందుకే ఆయా కార్యకర్తలు మా నేతలు కనపడడం లేదని మాట్లాడుకుంటున్నారట.
Read Also : Russian Army Shoes : రష్యా ఆర్మీ బూట్లు.. మన దేశంలోనే తయారవుతాయి తెలుసా ?