Jagan Mohan Reddy: 3 రోజుల పాటు కడప జిల్లాకు వైఎస్ జగన్.. రీజన్ ఇదే..!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు.
- By Gopichand Published Date - 02:47 PM, Fri - 5 July 24

Jagan Mohan Reddy: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇటీవల పులివెందుల పర్యటన ఆ తర్వాత బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో 3 రోజుల పాటు కడపలో పర్యటించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈనెల 8వ తేదీన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన జూలై 6, 7, 8 తేదీల్లో కడపలో ఉండనున్నారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు కూడా చేశారు.
రేపు ఉదయం తాడేపల్లిలోని తన ఇంటి నుంచి వైఎస్ జగన్ కడప వెళ్లనున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన జయంతి కార్యక్రమాలను జగన్ పరిశీలించనున్నారు. అయితే ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట అయిన కడపలో కూడా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
Also Read: SUV Cars: భారత్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలు ఇవే..!
మరోవైపు షర్మిల కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీపీసీసీ చీఫ్ అయిన తర్వాత షర్మిల తొలిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు కూడా ఆహ్వానం పంపింది షర్మిల. వారితో పాటు తన తల్లి విజయమ్మను కూడా జయంతి వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జూలై 8వ తేదీ గురించి హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.
We’re now on WhatsApp : Click to Join