YCP-BRS : ఖమ్మం సభకు సీఎంలు, జగన్ కు ఆహ్వానం నో ! కేసీఆర్ ఎత్తుగడ!
ఏసీ,తెలంగాణ సీఎం (YCP-BRS)అర్థంకాని రాజకీయ గేమ్ ఆడుతున్నారు.
- By CS Rao Published Date - 01:24 PM, Tue - 17 January 23

ఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ (YCP-BRS) ప్రత్యర్థులకు ఒక మాత్రాన అర్థంకాని విధంగా రాజకీయ గేమ్ ఆడుతున్నారు. స్వతహాగా అన్నదమ్ముల మాదిరిగా క్విడ్ ప్రో కో రాజకీయాలను నడుపుతున్నారు. పరస్పర అవగాహన లేకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోరని బాహ్య ప్రపంచానికి తెలుసు. అందుకే, ఏపీ అసెంబ్లీ, సెక్రటరియేట్ లను ఒక కలం పోటుతో తెలంగాణకు ఉదారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఖమ్మం సభకు(Khammam) కేసీఆర్ ఆహ్వానించకపోవడం వ్యూహాత్మకం.
ఏసీ , తెలంగాణ సీఎం రాజకీయ గేమ్ (YCP-BRS)
గత కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ వేసిన అడుగులను చూశాం. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ వినిపించారు. ఆ తరువాత ఐదేళ్ల పాటు సైలెంట్ గా ఉన్న ఆయన ఇటీవల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చేసి, జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఆ సందర్భంగా తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఇటీవల వెళ్లారు. అక్కడి సీఎంలతో భేటీ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అధిపతులతో సంప్రదింపులు జరిపారు. విచిత్రంగా పక్కనే ఉన్న ఏపీ రాష్ట్రానికి మాత్రం ఆయన అడుగు పెట్టలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డితో జాతీయ రాజకీయాల గురించి సంప్రదింపులు జరపలేదు. అలాగని, వాళ్లిద్దరూ (YCP-BRS) రాజకీయంగా దూరమని అనుకుంటే పొరబాటే.
Also Read : KCR Khammam:గ్రూప్ లకు చెక్!కూకట్ పల్లికి పువ్వాడ,ఖమ్మం బాస్ గా తుమ్మల?
వ్యూహాలను రచించడంలో కేసీఆర్ దిట్ట. జాతీయ పార్టీ పెట్టడానికి ముందుగా ప్రశాంత్ కిషోర్ సర్వేల ద్వారా అధ్యయనం చేశారు. కనీసం 100 ఎంపీ స్థానాలను టార్గెట్ చేస్తూ దేశ వ్యాప్తంగా ముందుకు కదలాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేసిన ఆయన కర్ణాటకలోని జేడీఎస్, జార్ఖండ్ లోని జేఎంఎం, మహారాష్ట్రలోని శివసేన, యూపీలోని ఎస్పీ, ఢిల్లీలోని ఆప్ తదితర పార్టీలతో మంతనాలు సాగించారు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ద్వారా కొత్త పార్టీ పెట్టించారని టాక్. ఇలా పలు రాష్ట్రాల్లోని రాజకీయ శూన్యత ఆధారంగా పొత్తు లేదా మద్ధతు ఈక్వేషన్లో కేసీఆర్ వెళుతున్నారు. అంతేకాదు, పోస్ట్ ఎలక్షన్లు, ప్రీ ఎలక్షన్ల సమీకరణాలపై ఒక అవగాహనకు కేసీఆర్ వచ్చారని తెలుస్తోంది. అందుకే, ప్రీ ఎలక్షన్ల ఈక్వేషన్ దిశగా మాత్రమే ఇప్పుడు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అందుకే, ఖమ్మం సభ (Khammam)కు ఆప్, జేడీఎస్, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీల తో చేతులు కలుపుతున్నారు. ఆ మేరకు ఆయా పార్టీల సీఎంలు, మాజీ సీఎంలు, అధిపతులకు ఆహ్వానం పంపారు.
ఖమ్మం సభకు నలుగురు సీఎంలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కు ప్రొటోకాల్ ప్రకారం తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం చెప్పేలా ఏర్పాట్లు చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు. ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకడం ద్వారా సామాజిక ప్రోటోకాల్ ను పాటించేలా ప్లాన్ చేశారు. సీపీఐ జాతీయనేత డి.రాజాకు స్వాగతం పలికే ప్రోటోకాల్ ను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ కు అప్పగించారు. బుధవారం ఉదయం జాతీయ నేతలంతా తొలుత సీఎం కేసీఆర్ తో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అనంతరం దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ఖమ్మం వేదికపై కనిపించే వాళ్లందరూ ఎన్నికల ముందు చేతులు కలపడానికి సిద్దపడ్డారని అర్థం.
Also Read : KCR BRS: కేసీఆర్ స్కెచ్.. ఆ ముగ్గురికి ‘బీఆర్ఎస్’ కీలక బాధ్యతలు!
ఎన్నికల తరువాత రాజకీయ సమీకరణాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వెంట ఉంటారని కేసీఆర్ వర్గీయుల్లోని టాక్. ఆ జాబితాలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఉంటారని తెలుస్తోంది. అయితే, ఆయన ఇప్పటికే యూపీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీతో జగన్మోహన్ రెడ్డి తెరవెనుక బంధాన్ని కలిగి ఉన్నారు. రాజకీయాలకు అతీతమైన బంధం మోడీ, జగన్మోహన్ రెడ్డి మధ్య నడుస్తోంది. ఇటీవల వరకు కేసీఆర్, మోడీ మధ్య కూడా బలమైన బంధం ఉండేది. కానీ, ముచ్చింతల్ రామానుచార్యుల విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా నెలకొన్ని ప్రొటోకాల్ వివాదం నుంచి ఇద్దరి మధ్యా చెడిందని చెబుతున్నారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డితో దూరంగా ఉన్నట్టు కేసీఆర్ కనిపిస్తున్నప్పటికీ వాళ్లిద్దరి మధ్యా విడదీయరాని బంధం ఉందని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఖమ్మం సభకు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించకపోవడం వెనుక కేసీఆర్ మార్క్ ఎత్తుగడ ఉందని సర్వత్రా వినిపిస్తోంది.