CM Jagan: వై నాట్ 175.. కీలక సమావేశానికి సీఎం జగన్ రెడీ
- Author : Balu J
Date : 26-02-2024 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరోవైపు రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు మారారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తారు. మరోవైపు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 27న మంగళగిరిలోని CK కన్వెన్షన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 175 అసెంబ్లీల నాయకులందరూ హాజరవుతున్నారు. దాదాపు 2 వేల మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ‘వై నాట్ 175’ అనే లక్ష్యంతో జగన్ ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలి, ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కోవాలో నేతలకు వివరించనున్నారు. మరోవైపు సోమవారం కుప్పంలో జగన్ సన్నాహక సమావేశం జరగనుంది.
Also Read: She Teams: ఈవ్ టీజర్స్ పై షీ టీమ్స్ నిఘా.. అసభ్యంగా ప్రవర్తిస్తే జైలుకే