Vijayasai Reddy Vs Coterie: విజయసాయి చెబుతున్న కోటరీలో ఉన్నదెవరు ? ఎదురైన చేదు అనుభవాలేంటి ?
పార్టీలో విజయసాయిరెడ్డి హవా వీయడం అనేది జగన్ చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి(Vijayasai Reddy Vs Coterie) వంటి నేతలకు గిట్టలేదని అంటారు.
- By Pasha Published Date - 11:13 AM, Thu - 13 March 25

Vijayasai Reddy Vs Coterie: వైఎస్సార్ సీపీలో ఉన్న కొందరు నేతల కోటరీ వల్లే తాను పార్టీ నుంచి బయటికి వచ్చానని విజయసాయి రెడ్డి అంటున్నారు. ఆ కోటరి వల్లే తనకు, జగన్‌కు మధ్య గ్యాప్ పెరిగిందని ఆయన చెబుతున్నారు. ఈ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ కోటరీలో ఉన్న నేతలు ఎవరు ? విజయసాయిరెడ్డికి వైఎస్సార్ సీపీలో ఎదురైన చేదు అనుభవాలు ఏమిటి ?
Also Read :Pochampally Srinivas Reddy : వెంటాడుతున్న కోడిపందేల కేసు.. పోచంపల్లికి మరోసారి పోలీసుల నోటీసులు
అప్పటి వరకు హవా..
2014 నుంచి 2019 వరకు వైఎస్సార్ సీపీ ప్రతిపక్షంలో ఉండగా, పార్టీలో కీలకమైన నేతగా విజయ సాయిరెడ్డి వ్యవహరించారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక, విజయ సాయిరెడ్డి పార్టీలో పవర్ ఫుల్ నేతగా ఎదిగారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నాయకుడిగా, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ముఖ్యమంత్రి తర్వాతి స్థానాన్ని అనుభవించారు. ఢిల్లీలో వైఎస్సార్ సీపీ తరఫున విజయ సాయిరెడ్డి, మిథున్ రెడ్డి మినహా మిగిలిన ఎంపీలు ఎవరూ పెద్దగా చర్చలోకి రాలేదు. ఇదే సమయంలో బీజేపీతోనూ విజయసాయి సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. 2019 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం చివరి వరకు వైఎస్సార్ సీపీలో ఆయన హవా కొనసాగింది. ఆ తర్వాత విజయసాయి హవా తగ్గడం మొదలైంది. స్థానిక ప్రజా ప్రతినిధులతో విభేదాలు, ఉత్తరాంధ్ర మంత్రులు, ఎంపీల ఫిర్యాదులతో ఆయనకు ప్రతికూల సమయం మొదలైంది. దీని వెనుక వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులతో కూడిన కోటరీ ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో విజయసాయిరెడ్డి హవా వీయడం అనేది జగన్ చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి(Vijayasai Reddy Vs Coterie) వంటి నేతలకు గిట్టలేదని అంటారు. అప్పట్లో సాయిరెడ్డి యావత్ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని శాసిస్తే, సజ్జల తాడేపల్లికి పరిమితం అయ్యారు. సుబ్బారెడ్డి టీటీడీతో సర్దుకోవాల్సి వచ్చింది.
Also Read :Smart Ration Cards: ఇక అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇలా ఉంటాయ్
ఆ తర్వాతి నుంచి ఎదురీత..
ఈనేపథ్యంలో 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో భూముల వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఈ ఆరోపణలు మరింతగా పెరిగాయి. తమకు సీఎంను కలిసే అవకాశం దొరకడం లేదని ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పలువురు వైఎస్సార్ సీపీ నేతలు వాపోయారు. దీనిపై సీఎం జగన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈనేపథ్యంలో ఉత్తరాంధ్ర ఇంఛార్జి బాధ్యతల నుంచి విజయ సాయిరెడ్డిని జగన్ తప్పించారు. ఆ బాధ్యతలను జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు.ఆ తర్వాత దాదాపు ఏడాది పాటు వైఎస్సార్ సీపీ వ్యవహారాలకు విజయసాయి రెడ్డి దూరంగా ఉండిపోయారు. ఈక్రమంలో పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలను ఆయనకు అప్పగించారు. దీంతో మళ్లీ పార్టీ వ్యవహారాల్లో విజయసాయి పాల్గొనడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నాలుగు జిల్లాల బాధ్యతలను సాయిరెడ్డికి ఇచ్చారు. దానిపైనా విభేదాలు తలెత్తడంతో, ఆ నాలుగు జిల్లాల బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగించారు. చివరకు విజయ సాయిరెడ్డి ఒంటరి అయ్యారు. గత మూడున్నర ఏళ్లలో కొన్ని సందర్భాల్లో వైఎస్ జగన్ ఉండే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి విజయసాయి రెడ్డికి ప్రవేశాన్ని నిరాకరించిన ఉదంతాలు కూడా ఉన్నాయట.
కరోనా లాక్‌డౌన్ సమయంలో..
ఐదేళ్ల క్రితం కరోనా లాక్‌డౌన్ సమయంలో విశాఖపట్నంలో 2020 మేలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే విశాఖకు జగన్ బయలుదేరారు. సీఎం కారులో ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. బయలుదేరే ముందు కారు నుంచి విజయ సాయిరెడ్డిని జగన్ కిందకు దింపేశారు, ఆయన స్థానంలో వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానిని కారులోకి ఎక్కించుకున్నారు. ఈ వీడియో మీడియాకు లీకైంది. ఈ వీడియోను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్‌కు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.