AP Floods : ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కడ..?
స్వయంగా సీఎం చంద్రబాబే నడుం లోతు వరదలో నడుచుకుంటూ బాధితుల బాధలు చూసారు..తప్పకుండ ప్రభుత్వం సాయం చేస్తుందని భరోసా కలిపించారు
- By Sudheer Published Date - 11:05 PM, Mon - 2 September 24
వామ్మో ఏం వర్షాలు (Rains)..ఏం వరదలు..ఎటు చూసిన నీళ్ళే..ఎటు పోయేటట్లు లేదు..ఎక్కడ ఉండేటట్లు లేదు..తినేందుకు తిండిలేదు..తాగేందుకు నీరు లేదు..బయటకు వెళదామంటే నడుము లోతు నీరు..ఎప్పుడు ఈ వరదలు తగ్గుతాయో..ఎవరు తమను ఆడుకుంటారో..ఇదే రెండు రోజులుగా విజయవాడ నగర ప్రజలు మాట్లాడుకుంటుంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. దీంతో కాలనీ వాసులు తాగేందుకు నీరు లేక..తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదుచూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ప్రభుత్వం సైతం కేంద్ర సాయం తీసుకోని వరద బాధితులను ఆదుకునేందుకు నడుం బిగించింది. స్వయంగా సీఎం చంద్రబాబే (CM Chandrababu) నడుం లోతు వరదలో నడుచుకుంటూ బాధితుల బాధలు చూసారు..తప్పకుండ ప్రభుత్వం సాయం చేస్తుందని భరోసా కలిపించారు. ఇటు మంత్రులు సైతం అన్ని ఏరియాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు అడిగితెలుసుకుంటూ తక్షణ సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) మాత్రం ఎక్కడ కనిపించకపోయేసరికి..అంత పవన్ కళ్యాణ్ ఎక్కడ అని మాట్లాడుకుంటున్నారు. అధికారం లేనప్పుడు నిత్యం ప్రజల మధ్య ఉండే పవన్..ఇప్పుడు ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించడేం అని ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి.. ఎప్పుడూ జనాల్లోనే కనిపిస్తున్నారు పవన్. అలాంటిది ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తి..అతలాకుతలం చేస్తున్న వేళలో జాడ లేకుండా పోవడం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా..? విదేశాలకు వెళ్లారా ..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకవేళ రాష్ట్రంలో లేకపోతే..అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించటం లాంటివి చేయొచ్చు కదా..? ఒకవేళ విదేశాలకు వెళ్తే..పర్యటన ఆపేసుకొని తిరిగి వచ్చేయొచ్చు కదా..? అని అంత ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ ఎక్కడ ఉన్నాడో..ఏంచేస్తున్నాడో..!!
Read Also : Dialogue War : కేటీఆర్ పై..రేవంత్ ..రేవంత్ పై కేటీఆర్..ఎక్కడ తగ్గడం లేదు ..!!
Related News
Pawan Kalyan : వరద ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన
AP Deputy CM visit to flood affected areas: కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. స్ధానికంంగా బోటులో ప్రయాణించి వెళ్లి మరీ వరద బాధితుల్ని కలుసుకున్నారు.