Dialogue War : కేటీఆర్ పై..రేవంత్ ..రేవంత్ పై కేటీఆర్..ఎక్కడ తగ్గడం లేదు ..!!
సందర్భం ఏదైనా సరే ఇరు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజల చేత 'ఛీ' అనిపించుకుంటున్నారు
- By Sudheer Published Date - 10:40 PM, Mon - 2 September 24
బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల (BRS VS Congress) మధ్య డైలాగ్ వార్ (Dialogue War) తగ్గడం లేదు. సందర్భం ఏదైనా సరే ఇరు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజల చేత ‘ఛీ’ అనిపించుకుంటున్నారు. రాష్ట్రానికి ఏదైనా ఆపద వస్తే..అధికార – ప్రతిపక్ష పార్టీలు సమన్వయం తో ప్రజలకు సాయం చేయడం..సలహాలు తీసుకోవడం..చర్చించుకోవడం వంటివి చేయాలి కానీ మీ వల్లే ముప్పు వచ్చిందంటే మీ వల్లే వచ్చిందంటూ ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల చేత ఛీ వీరు మారారు అనిపించుకుంటున్నారు. గత గడిచిన మూడు రోజులు తెలంగాణ లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. రోడ్లు , రైల్వే ట్రాక్ లు , బ్రిడ్జ్ లు , భవనాలు , పంటపొలాలు ఇలా అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 మంది వరదల కారణంగా మృతి చెందారు. ఇలాంటి ఈ భయానక సమయంలో కూడా ఇరు పార్టీల నేతలు ఒకరి పై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతే కాదు ఏపీ సీఎం చంద్రబాబుతో పోలుస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ పక్క రాష్ట్రం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 6 రెస్క్యూ హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్‌లను ఉపయోగిస్తోంది. మన తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లను ఉపయోగించి ఎన్ని ప్రాణాలు కాపాడగలిగారో ఊహించండి?. పెద్ద సున్నా’’ అని అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఇటు సీఎం రేవంత్ (CM Revanth Reddy) సైతం ఘాటైన వ్యాఖ్యలే చేసారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత ఎక్కడున్నారు? బయటకు వచ్చి ప్రజల కష్టాలను తెలుసుకుని కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్ష నేతలే వెళ్తారు. కానీ, కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావడంలేదు. ఏపీలో ప్రతిపక్ష నేత కూడా వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కాసీ, తెలంగాణలో మాత్రం కేసీఆర్ పర్యటించడంలేదు. కేటీఆర్ అమెరికాలో ఉండి.. ఖమ్మం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులపై విమర్శలు చేస్తున్నాడు. అమెరికాలో ఎంజాయ్ చేస్తూ మంత్రులను బద్నాం చేయడం సరికాదు అన్నారు. వెంకయ్యనాయుడు ముందుకువచ్చి నైతిక మద్దతును ఇచ్చారు. కానీ, కేసీఆర్ స్పందించరు.. కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించరు. విపత్తుల వేళ బీఆర్ఎస్ నేతలు ముందుకు వచ్చి ప్రజలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడంలేదు.. పైగా ఆదుకుంటున్న ప్రభుత్వంపై విమర్శలు. వరద సమయంలో బురద రాజకీయాలు మానుకోవాలి’ అంటూ రేవంత్ హెచ్చరించారు. ఇలా ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నాలు చేసుకోవడం చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇద్దరు ఇద్దరే..రెండు పార్టీలు ఒక్కటే అని మాట్లాడుకుంటున్నారు.
Read Also : Vijayawada Floods : చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే వరదలు – జగన్ కీలక వ్యాఖ్యలు
Related News
Annapurna Studios Donation : తెలంగాణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ విరాళం
Annapurna Studios donation for Telangana : ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున నటి, నిర్మాత యార్లగడ్డ సుప్రియ రూ.50 లక్షల చెక్కును సీఎం రేవంత్ కు అందజేశారు.