Rushikonda Palace : రుషికొండ నిర్మాణాలపై సీఎం ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు..?
Rushikonda Palace : కొందరు ఈ భవనాలను ఆస్పత్రిగా మార్చాలని సలహా ఇస్తుంటే.. మరికొందరు విద్యా సంస్థలుగా మార్చాలని సలహా ఇస్తున్నారు
- By Gopichand Published Date - 06:56 PM, Sat - 2 November 24

ఏపీ సీఎం చంద్రబాబు (CM CHandrababu) ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన చేస్తున్నారు. శనివారం అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం పరవాడ నుంచి నేరుగా రుషికొండకు చేరుకున్నారు. రుషికొండలో చేపట్టిన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం రుషికొండ (Rushikonda Palace)పై రూ. 500 కోట్లతో విలాసవంతమైన భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎమ్మెల్యే గంటా మీడియాతో కలిసి వెళ్లి లోపల ఎలాంటి నిర్మాణాలు జరిగాయి? అసలు ఎంత ఖర్చు పెట్టారు లాంటి విషయాలను బహిర్గతం చేశారు.
అయితే మాజీ సీఎం జగన్ చేపట్టిన ఈ భవనాల నిర్మాణాలను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఖర్చు తగులుతోంది. ఇప్పుడు ఖర్చుని ఎలాగైన తగ్గించుకోవాలని సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ రుషికొండ భవనాలను కేవలం బయటనుంచి మాత్రమే పరిశీలించారు. తాజాగా మంత్రి, ఎమ్మెల్యేతో కలిసి పర్యటించిన సీఎం చంద్రబాబు ఈ భవనాలను ఏం చేయాలో చెప్పాలని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు.
అయితే కొందరు ఈ భవనాలను ఆస్పత్రిగా మార్చాలని సలహా ఇస్తుంటే.. మరికొందరు విద్యా సంస్థలుగా మార్చాలని సలహా ఇస్తున్నారు. టూరిస్ట్ స్పాట్‌గా చేస్తే మంచి ఇన్ కమ్ వస్తుందని మరికొందరు నిపుణులు కూటమి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. అయితే దీనిపై మెజార్టీ ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత రుషికొండ ప్యాలెస్‌పై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందని తెలుస్తోంది.
ఈ రుషికొండపై నిర్మించిన భవనాలను సినిమా షూటింగ్‌లకు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ భవనాలపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అయితే త్వరలోనే ఈ భవనాలపై కూటమి పెద్దలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ భవనాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Read Also : Telangana Panchayat Elections : సంక్రాంతిలోపు సర్పంచ్ ఎన్నికలు – మంత్రి పొంగులేటి