పిఠాపురంలో మీగోల ఏంటి నాయనా…!
పిఠాపురంలో ఈ నాలుగు రోజులు... ఏది జరిగినా కూడా సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నారు కాబట్టి..!
- By manojveeranki Published Date - 05:00 PM, Tue - 28 May 24

పిఠాపురంలో (Pithapuram) ఈ నాలుగు రోజులు… ఏది జరిగినా కూడా సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్ (Pawan Kalyan) పోటీ చేస్తున్నారు కాబట్టి..! పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిందో…అప్పటి నుంచీ కూడా ట్రెండింగ్(Trending)లో ఉన్న సెగ్మెంట్. అక్కడ ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా కూడా సాగింది. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త…చాలా పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు.
అయితే ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. ఇప్పటికే పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో నడుస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పవన్ అనుచరులు మొదలు పెట్టిన మైండ్ గేమ్‌కి వైసీపీ(Ycp) ధీటుగా కౌంటర్ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేం క్యాప్షన్‌ని.. వైసీపీ కి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీత(Vanga Geetha)కు పదవి కూడా ఇచ్చేశారు. వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించుకుంటున్నారు. టూవీలర్‌ల నెంబర్ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు. పిఠాపురం(Pithapuram)లో ఇరుపార్టీల మధ్య ఆధిపత్య పోరు ముందు నుంచి ఉంది.
అభ్యర్థి ప్రకటన నుంచీ… ఎన్నికలు జరిగే వరకూ కూడా పిఠాపురం సెగ్మెంట్‌పై హాట్‌హాట్‌గా డిబెట్లు (Hot Debates) జరిగాయి. వాడివేడిగా వాదనలు కూడా నడిచాయి. ఊహాగానాలు ఊపిరి సలపకుండా చేశాయి. ఎవరికి వారే గెలుస్తారని ఎంతో ధీమాగా ఉన్నారు. కొందరు మెజారిటీ ఎంత వస్తుందోకూడా.. నెంబర్లతో సహా చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఫలానా ఎమ్మెల్యే మా తాలుకా అని స్టిక్లర్లు అంటించుకొని తిరుగుతున్నారు. బైకులు, కార్లు, ఆటోలు ఇలా పిఠాపురం(Pithapuram)లో ఎక్కడ చూసినా రేడియం రేలారే రేలారే పడుతున్నాయి. ఫైనల్ గా ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. ఏం తేలకముందే.. ఏంటీ స్టిక్కర్ల వార్ అని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ఎవరికి వారు పర్సనల్‌గా తీసుకుంటేనే పిఠాపురం పహిల్వాన్‌లకు మధ్య ఫైలింగ్ ఎక్కడికో పోతుందంటున్నారు.