Diarrhoea : శాసన మండలి నుండి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుల వాకౌట్
గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కంటే ఐదు నెలల కాలంలో ఎందుకు త్రాగు నీటి వ్యవస్థలను మెయింటెన్ చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.
- By Latha Suma Published Date - 12:55 PM, Wed - 13 November 24

YSRCP Members : విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించన డమేరియా మరణాలపై శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శాసన మండలి నుండి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఎన్ని మరణాలు జరిగాయి, చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు నిలదీశారు. గతంలో నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఎప్పుడు లేనంతగా డయేరియా ప్రబలిందన్న బొత్స సత్యనారాయణ … గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కంటే ఐదు నెలల కాలంలో ఎందుకు త్రాగు నీటి వ్యవస్థలను మెయింటెన్ చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు ప్రతిగా మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ.. గత ఐదేళ్ళలో పంచాయితీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదన్నారు అచ్చెన్నాయుడు. డయేరియా భాదితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూనే నియోజకవర్గంలో పరిస్థితులపై బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయనే చెప్పారని మంత్రి సత్య కుమార్ అన్నారు. అయితే బొత్స ఆవేదన చూస్తుంటే ముచ్చటేస్తుందని చురకలు అంటించారు. ఈ క్రమంలోనే శాసన మండలి నుండి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
Read Also: Vehicle Scrapping : జనవరి నుండి తెలంగాణ లో వాహన తుక్కు (స్క్రాపింగ్) విధానం అమలు