Vehicle Scrapping : జనవరి నుండి తెలంగాణ లో వాహన తుక్కు (స్క్రాపింగ్) విధానం అమలు
Vehicle scrapping policy : వాహనదారులు తమ కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ చేస్తే వారికి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త వాహనం కొనుగోలులో రాయితీ పొందవచ్చు
- By Sudheer Published Date - 12:44 PM, Wed - 13 November 24

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పర్యావరణ పరిరక్షణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన వాహనాలను తొలగించేందుకు 2025 జనవరి 1వ తేదీ నుంచి వెహికల్ స్క్రాపింగ్ (Vehicle Scrapping) విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ప్రకారం.. వాహనదారులు తమ కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ చేస్తే వారికి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త వాహనం కొనుగోలులో రాయితీ పొందవచ్చు. పాత వాహనాల వల్ల కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎకో ఫ్రెండ్లీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక, పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి నగర శివారుల్లోని శంషాబాద్, నందిగామ, తూప్రాన్ ప్రాంతాల్లో స్క్రాపింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ రంగంలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ విధానం వల్ల కాలుష్యం తగ్గడంతోపాటు రోడ్డు ప్రమాదాలను కూడా నియంత్రించవచ్చని రవాణాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వెహికల్ స్క్రాపింగ్ అనేది కాలం చెల్లిన లేదా మరమ్మత్తులకు మించి దెబ్బతిన్న వాహనాలను తొలగించి, వాటి భాగాలను పునర్వినియోగం లేదా రీసైక్లింగ్ చేయడం. ఈ విధానం పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధానం వల్ల పాత వాహనాల నిర్వహణ, రోడ్డు భద్రత, పర్యావరణ పరిరక్షణలో సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Childrens Day 2024 : బాలల దినోత్సవాన్ని నవంబరు 14నే ఎందుకు నిర్వహిస్తారంటే..