Covid : వైజాగ్ కేజీహెచ్‌లో మహిళ మరణం కొవిడ్ వల్ల కాదు : సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్
వైజాగ్ కేజీహెచ్‌లో కరోనా వల్ల మహిళ మరణించిందన్న వార్తలను సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుయార్ ఖండించారు. ఆమెకు
- By Prasad Published Date - 07:28 AM, Wed - 27 December 23

వైజాగ్ కేజీహెచ్‌లో కరోనా వల్ల మహిళ మరణించిందన్న వార్తలను సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుయార్ ఖండించారు. ఆమెకు గతంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల కారణంగానే మరణించిందని.. కోవిడ్ వల్ల కాదని ఆయన తెలిపారు. తేలికపాటి లక్షణాలతో రూపాంతరం చెందిన కోవిడ్ జెఎన్-1 వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేజీహెచ్‌లో మరణించిన మహిళకు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం, మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్ సిండ్రోంతో పాటు తీవ్రమైన కిడ్నీ వైఫల్యం సమస్యలున్నాయని తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఆమె వైజాగ్ ఛాతీ ఆసుపత్రిలో చేరారని.. రొటీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఆమెకు కొవిడ్ పాజిటివ్ గా తేలిందన్నారు. తదుపరి నిర్వహణ, డయాలిసిస్ కోసం ఆమెను వైద్యులు 24వ తేదీన కెజిహెచ్ కు తరలించారని డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. రక్త నమూనాలను విజయవాడ సెంట్రల్ లేబరేటరీకి జినోమ్ నిర్ధారణ కోసం పంపామని.. ఆమెను బ్రతికించేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ మంగళవారం మధ్యాహ్నం ఆమె మరణించిందని తెలిపారు. కేజీహెచ్ వైద్యులు ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని.. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Also Read: TSRTC : పురుషులకు ప్రత్యేక బస్సులు.. ఇతర బస్సుల్లో 25 సీట్లు రిజర్వ్ ?