HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vizag Indus Hospital Fire Accident

Indus Hospital Fire Accident : వైజాగ్ ఇండస్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి

విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ హాస్పటల్ (Indus Hospital)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.

  • Author : Sudheer Date : 14-12-2023 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Huge Fire Accident In Indus
Huge Fire Accident In Indus

Indus Hospital Fire Accident : విశాఖపట్నం (Visakhapatnam) జగదాంబ సెంటర్ (Jagadamba Centre) లోని ఇండస్ హాస్పటల్ (Indus Hospital ) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదంలో పలువురు రోగులు చిక్కుకున్నారు. వీరిని మంటల్లో నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి భారీగా వెలువడుతున్న పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ ఆసుపత్రి (Indus Hospital) పరిసర ప్రాంతాల్లోని షాపులను అధికారులు మూసేశారు.

We’re now on WhatsApp. Click to Join.

పొగలు వస్తుండటంతో ఊపిరాడక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో అంతస్థు మాత్రమే కాకుండా ఆసుపత్రి నుంచి రోగులు బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రిలో ఎందరు రోగులున్నారన్నది తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది రోగులను ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రక్షించినట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు 40 మంది రోగులను బయటకు తీసుకొచ్చి.. వారిని అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు.

విశాఖలోని ఇండస్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. రోగులను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. భయాందోళనలో చుట్టుపక్కల ప్రజలు #AndhraPradesh #Vizag #Visakhapatnam pic.twitter.com/BuGCEEnM1e

— Hashtag U (@HashtaguIn) December 14, 2023

ఆపరేషన్ థియేటర్లలో ఉన్న నైట్రస్ ఆక్సైడ్‌ పేలుళ్లు జరగడంతో భవనం మొత్తం మంటలు వ్యాపించాయని అంటున్నారు. ఐసీయూలలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఫైర్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్ సిబ్బంది వేగంగా స్పందించడంతో భవనంలో ఉన్న వారిని కాపాడారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నార్ స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రిలో దాదాపు అందరిని సురక్షితంగా బయటకు తరలించినట్టు చెబుతున్నారు. ఐసీయూలలో ఉన్న 15మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మూడో అంతస్తులో ఉన్నవారిని కూడా ఫైర్ సిబ్బంది తరలించారు. రెండో అంతస్తులో మంటలు అదుపు రాలేదని, మొదటి, మూడో అంతస్తులో ఉన్న రోగులను కాపాడినట్లు పోలీసులు తెలిపారు.

Read Also : KCR : రేపు హాస్పటల్ నుండి కేసీఆర్ డిశ్చార్జ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Fire Accident
  • indus hospital
  • vizag

Related News

    Latest News

    • West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

    • Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

    • Kerala: ఎర్ర జెండా ను పట్టించుకోని ఓటర్లు

    • West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

    • Trisha at Vijay House : విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

    Trending News

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd