KCR : రేపు హాస్పటల్ నుండి కేసీఆర్ డిశ్చార్జ్
- Author : Sudheer
Date : 14-12-2023 - 12:24 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వారం రోజుల క్రితం తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. దీంతో సోమాజిగూడ యశోద హాస్పటల్ (Yashoda Hospital) లో ఆయనకు సర్జర్ చేసారు. గత వారం రోజులుగా హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ వచ్చిన కేసీఆర్ రేపు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ (KCR will be discharged ) కాబోతున్నారు. హాస్పటల్ నుండి నంది నగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ స్పష్టం చేశారు. దీంతో రేపు ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారని తెలిసి ప్రధాని మోడీ, బిఆర్ఎస్ నేతలు , శ్రేణులతో పాటు ఇతర పార్టీల నేతలు , సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. అలాగే హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ను పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , మాజీ సీఎం చంద్రబాబు , కాంగ్రెస్ మంత్రులు , బిఆర్ఎస్ నేతలు అలాగే చిత్రసీమ నుండి మెగా స్టార్ చిరంజీవి , నాగార్జున , ప్రకాష్ రాజ్ తదితరులు హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ను చూడడం జరిగింది.
ఇక గత పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి గా విశేష సేవలు అందించిన కేసీఆర్..రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్..మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందని భావించారు కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. దీంతో 39 స్థానాలతో గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీ లో అడుగుపెట్టింది.
Read Also : TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, రేపట్నుంచి ఆ రూట్లో ఏసీ బస్సులు ప్రారంభం