HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayawada Railway Court Dismisses 2016 Tuni Train Burning Case

Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (Ratnachal Express) రైలు దహనం కేసు (Tuni Train Burning Case)లో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును కొట్టివేస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పునిచ్చింది.

  • Author : Gopi Date : 02-05-2023 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tuni Train Burning Case
Resizeimagesize (1280 X 720) (1)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (Ratnachal Express) రైలు దహనం కేసు (Tuni Train Burning Case)లో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును కొట్టివేస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కేసును సక్రమంగా విచారించనందుకు రైల్వేకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంత సున్నితమైన అంశాన్ని ఐదేళ్లు ఎందుకు లాగారని సూటిగా ప్రశ్నించింది.

విచారణ ప్రక్రియలో రైల్వే పోలీసులు నేరం రుజువు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విజయవాడ రైల్వే కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేరని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోర్టు ఆదేశించింది. అనంతరం కేసును కొట్టివేస్తూ తీర్పును తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు కులస్తులు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2016 జనవరి 31న కాపు రిజర్వేషన్ సాధన కోసం అప్పటి తూర్పుగోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో కొందరు దుండగులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైలు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ సమయంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also Read: Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి సందర్భంగా 44 ప్రత్యేక రైళ్లు

దీంతో రైలు దహనం కేసులో రైల్వే పోలీసులు 41 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ముద్రగడ పద్మనాభం, ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా ప్రస్తుత మంత్రి దాశెట్టి రాజా, సినీ నటుడు జీవీ సహా 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 20 మంది విచారణకు హాజరుకాగా.. ఐదుగురు తమకేమీ తెలియదని వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసు శాఖ, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లో నమోదైన పలు కేసులను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. RPF కేసు పెండింగ్‌లో ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 146, 147, 153, 174 (ఎ), (సి) కింద కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు సుదీర్ఘ వాదనల అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Railway Court
  • Ratnachal Express
  • Train Burning Case
  • Tuni
  • Tuni Train Burning Case
  • vijayawada
  • Vijayawada Railway Court

Related News

CM Chandrababu

CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తుని నియోజ‌క‌వ‌ర్గం చామ‌వ‌రం గ్రామంలో చంద్ర‌బాబు పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్‌ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె

  • CBN

    CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

Latest News

  • Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Sleep Disturbance: నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!

  • Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd