Good News : అతి త్వరలో ఏపీ ప్రజలు భారీ శుభవార్త వినబోతున్నారు
Good News : రాష్ట్రంలో లక్షలాది మందికి కొత్త ఇళ్లను అందించే ఆలోచనలో ప్రభుత్వమే ఉన్నది. ఇందులో భాగంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, వాటిని 2025 జూన్ 12న ప్రారంభించే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం
- By Sudheer Published Date - 06:55 PM, Sun - 20 April 25

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి సర్కారు (TDP) జూన్ 12, 2025 తో ఏడాది పూర్తి కాబోతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త (Good News) ప్రకటించనుంది. రాష్ట్రంలో లక్షలాది మందికి కొత్త ఇళ్లను అందించే ఆలోచనలో ప్రభుత్వమే ఉన్నది. ఇందులో భాగంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, వాటిని 2025 జూన్ 12న ప్రారంభించే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఇళ్లను పేదల కోసం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
IPL 2025 Purple Cap Table: ఐపీఎల్ 2025లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ వీరులు వీరే!
ఇప్పటి వరకు 1.70 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా 60,000 ఇళ్లు తుది దశలో ఉన్నాయి. ఈ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ. 50,000 చొప్పున, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75,000 చొప్పున అదనపు సాయం అందిస్తూ, ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా గృహనిర్మాణం రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలలో జరుగుతోంది.
ప్రభుత్వ అధికారులు ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు పర్యవేక్షణలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి, నిర్మాణ పనులను సమయానికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 12వ తేదీతో ఇళ్ల గృహప్రవేశం చేయడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహం కలిగిన ముడి లక్ష్యాన్ని సాధించడం మొదలు పెట్టింది.